News March 2, 2025

విశాఖ: పరీక్షలకు హాజరవుతున్న జువైనల్ హోమ్ విద్యార్థులు

image

చిన్నగదిలి తహశీల్దార్ కార్యాలయం వెనుక గల ప్రభుత్వ బాలికల పరిశీలన గృహం(జువైనల్ హోమ్) విద్యార్థులు పరీక్షలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఒక విద్యార్థిని శనివారం మొదటి సంవత్సరం పరీక్ష రాసింది. రెండో సంవత్సరం పరీక్షలకు మరో విద్యార్థిని సిద్ధమవుతోంది. కాగా పదో తరగతి పరీక్షలు రాసేందుకు 8 మంది సిద్ధమవుతున్నారని హోమ్ సూపరింటెండెంట్ సునీత తెలిపారు.

Similar News

News March 19, 2025

విశాఖ: చిన్న శ్రీను కుమారుడి మృతి

image

విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్, భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు రెండో కుమారుడు ప్రణీత్ నేడు మృతి చెందాడు. 2020లో ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రణీత్ 4 సంవత్సరాల 10 నెలల పాటు మృత్యువుతో పోరాడాడు. చివరకు విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారు.

News March 19, 2025

ట్రాన్స్‌జెండర్ హత్య ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా

image

అనకాపల్లి జిల్లాలో ట్రాన్స్‌జెండర్ దారుణ హత్య ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం.. అక్కడి నుంచి అనకాపల్లి ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. త్వరగా దర్యాప్తు పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ సీఎంకు తెలిపారు. కాగా ట్రాన్స్‌జెండర్‌ను చంపి ముక్కలుగా నరికి మూట కట్టి కశింకోట(M) బయ్యవరం వద్ద పడేసిన సంగతి తెలిసిందే.

News March 19, 2025

గాజువాక ఐటీఐలో నేడు జాబ్ మేళా 

image

గాజువాక ఐ.టి.ఐలో నేడు జాబ్ మేళా జరగనుంది. అప్రెంటీస్‌తో పాటు నిరుద్యోగులు ఉదయం 9 గంటలకు ఆధార్ కార్డు, ఒరిజినల్ సర్టిఫికెట్లుతో రావాలని ఐటీఐ ప్రిన్సిపల్ కె.ఎస్. శ్రీనివాసరావు తెలిపారు. పదవతరగతి, ఐటీఐ, డిగ్రీ విద్యార్హతతో పాటు 18నుంచి 35ఏళ్లలోపు అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని అన్నారు. జిల్లా నైపుణ్యభివృద్ధిసంస్థ, ఉపాధిశాఖ ఆధ్వర్యంలో ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయని అయన తెలిపారు.

error: Content is protected !!