News June 5, 2024

విశాఖ: పర్యావరణ అవగాహన ర్యాలీ నిర్వహించిన రైల్వే

image

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని రైల్వే అధికారులు ఘనంగా నిర్వహించారు. డీఆర్ఎం సౌరవ్ ప్రసాద్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ వద్ద పర్యావరణ ప్రాధాన్యత తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైల్లో ప్రయాణికులకు చేతి సంచులను పంపిణీ చేసి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ప్రచారం జరిపారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు మంజు శ్రీ ప్రసాద్ నేతృత్వంలో మొక్కలు నాటారు.

Similar News

News December 27, 2025

భీమిలికి పెరుగుతున్న వలసలు?

image

విశాఖ తీరానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని ప్రభుత్వం చెబుతుంటే, వలసదారులు అక్కడే వాలుతున్నాయి. ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, IT పురోగతి పెరగడం మైగ్రేషన్‌ను పెరుగుతుందని గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో 1,2 స్థానాల్లో భీమిలి, గాజువాకలు నిలిచాయి.ప్రస్తుతం భీమిలిలో 3,66,256 మంది ఓటర్లు ఉన్నారు. భీమిలి నియోజకవర్గంలో సగం అర్బన్, సగం గ్రామీణ వాతావరణం ఉంటుంది.

News December 27, 2025

‘ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులను జీవీఎంసీ వెబ్ పోర్టల్ నందు చెల్లించండి’

image

జీవీఎంసీ పరిధిలో ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను, నీటి పన్ను జీవీఎంసీ యొక్క www. gvmc.gov.in వెబ్సైట్ నందు సులభంగా చేసుకోవచ్చని జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి.రమణమూర్తి శనివారం తెలిపారు. ఈ పోర్టల్ ద్వారా క్రెడిట్, డెబిట్, నెట్ బ్యాంకింగ్, UPI ద్వారా చెల్లించుకోవచ్చు అన్నారు. ఆస్తిపన్ను చెల్లింపుదారులు ఈ సౌకర్యాలను ఉపయోగించుకొని విలువైన సమయం వృథా కాకుండా పన్నులు చెల్లింపు చేయవచ్చు పేర్కొన్నారు.

News December 27, 2025

అనపర్తి రైల్వే స్టేషన్‌లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు తాత్కాలిక హల్ట్

image

విశాఖ నుంచి లింగంపల్లి (12805/12806) వెళ్లే, లింగంపల్లి విశాఖ వచ్చే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు అనపర్తి రైల్వే స్టేషన్‌లో తాత్కాలిక హల్ట్ కల్పించినట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం పవన్ శనివారం తెలిపారు. ప్రయాణికుల డిమాండ్ మేరకు జనవరి 6 నుంచి ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు విషయాన్ని గమనించాలన్నారు.