News February 1, 2025
విశాఖ -పలాస పాసింజర్ రైళ్ల గమ్యం కుదింపు

వాల్తేర్ డివిజన్లో సాంకేతిక కారణాల వల్ల విశాఖ -పలాస పాసింజర్ రైళ్ల గమ్యం కుదింపు చేసినట్లు వాల్తేర్ డీసీఎం సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ-పలాస (67289/90)రైళ్లు ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు శ్రీకాకుళం వరకు మాత్రమే వెళ్తుందన్నారు. తిరుగు ప్రయాణంలో పలాసకు బదులుగా శ్రీకాకుళం నుంచి బయలుదేరుతుందన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
Similar News
News January 7, 2026
బెంగుళూరు ట్రైన్ ఎక్కి మిస్ అయిన విశాఖ వాసి

తెన్నేటి నగర్‌కు చెందిన సిమ్మ శ్రీను బాబు (48) వృత్తి రీత్యా బెంగళూరులో పని చేస్తున్నారు. డిసెంబర్ 16న ప్రశాంతి ఎక్స్ ప్రెస్ ఎక్కి విశాఖకు బయలుదేరారు. అయితే మరుసటి రోజు అతను విశాఖ చేరుకోలేదు. తెలిసిన వారందరికీ అడిగినప్పటికీ ఆచూకీ దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు కంచరపాలెం పోలీసులు, బెంగళూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.
News January 7, 2026
జీవీఎంసీ అధికారుల తీరుపై ఎమ్మెల్యేల అసంతృప్తి

విశాఖలో పెండింగ్ సమస్యల పరిష్కారంపై జిల్లా MLAలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలకు తాము సమాధానం చెప్పలేకపోతున్నామని జీవీఎంసీ అధికారుల వద్ద అసహనం వ్యక్తం చేశారు. నిన్న మేయర్, కమిషనర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలతో సమావేశం జరిగింది. ఇందులో ఎంపీ గొల్లబాబూరావు, పలు నియోజకవర్గాల MLAలు పాల్గొని టిడ్కో హౌసింగ్ ఇళ్ల కేటాయింపుల్లో జాప్యంపై అధికారులను గట్టిగా నిలదీశారు.
News January 7, 2026
నేడు విశాఖ కోర్టుకుహాజరు కానున్న మంత్రి నారా లోకేష్..

మంత్రి నారా లోకేష్ నేడు విశాఖ కోర్టుకు హాజరుకానున్నారు.ఓ దినపత్రికలో తనపై వచ్చిన ‘చినబాబు చిరుతిళ్లకు లక్షల ఖర్చు’ అనే కథనానికి వ్యతిరేకంగా ఆయన దాఖలు చేసిన పరువు నష్టం దావా విచారణ ఇవాళ జరగనుంది. 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో క్రాస్ ఎగ్జామినేషన్షన్ కు ఆయన హాజరుకానున్నారు ఇప్పటికీ రెండుసార్లు ఆయన హాజరయ్యారు.


