News September 14, 2024

విశాఖ: పలు అభివృద్ధి పనులకు స్థాయి సంఘం ఆమోదం

image

విశాఖ జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన స్థాయి సంఘం సమావేశంలో పలు అభివృద్ధి పనులకు ఆమోదం లభించినట్లు మేయర్ హరి వెంకట కుమారి తెలిపారు. మేయర్ అధ్యక్షతన స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. 250 అంశాలతో అజెండాను ప్రవేశ పెట్టగా 102 అంశాలకు ఆమోదం లభించిందని అన్నారు. సమయాభావం కారణంగా మిగిలిన అంశాలను వాయిదా వేసినట్లు తెలిపారు.

Similar News

News October 7, 2024

యలమంచిలి మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ

image

యలమంచిలి మాజీ MLA కన్నబాబు ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. రాంబిల్లిలోని ఆయన ఇంటి తలుపు గడియలు విరగ్గొట్టి లోపలకు ప్రవేశించారు. పూజగదిలో వెండి వస్తువులు పట్టుకుపోయారు. వీటి విలువ రూ.50వేల వరకు ఉంటుందని అంచనా. అలాగే ఓ గ్యాస్ ఏజెన్సీలో రూ.50వేల నగదు పోయినట్లు బాధితుడు పి.సంతచేరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీలపై ఆదివారం ఫిర్యాదులు అందడంతో దర్యాప్తు చేస్తున్నామని CI సీహెచ్ నర్సింగరావు తెలిపారు.

News October 7, 2024

ఆరోజే అందరూ కలిసి వచ్చి ఉంటే బాగుండేది: పవన్ కళ్యాణ్

image

‘విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర సభ నిర్వహించి ఉద్యోగ, కార్మిక సంఘాలు ఒక తాటిపైకి వచ్చి అఖిల పక్షంతో కేంద్రం దగ్గరకు వెళ్దామంటే ఏ ఒక్కరూ స్పందించలేదు. ఆరోజు అందరూ కలిసి వచ్చి ఉండుంటే, ఈరోజు ఇంత ఆందోళన చెందాల్సిన అవసరం ఉండేదు కాదు’ అని dy.cm పవన్ కళ్యాణ్ అన్నారు. కార్మికుల ఆందోళనను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని సోమవారం మంగళగిరి క్యాంప్ ఆఫీసులో స్టీల్ ప్లాంట్ కార్మిక నాయకులతో జరిగిన సమావేశంలో అన్నారు.

News October 7, 2024

విశాఖ: డిప్యూటీ సీఎంతో ముగిసిన భేటీ

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో విశాఖ ఉక్కు పోరాట కమిటీ నాయకుల భేటీ ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు చర్చలు జరిగాయి. ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయమని కార్మికులు డిమాండ్ చేశారు. ఉక్కు కర్మాగారంలో జరుగుతున్న పరిణామాలను డ్రాఫ్ట్ రూపంలో కార్మిక సంఘాల నాయకుల పవన్ కళ్యాణ్‌కు అందజేశారు.