News September 1, 2024

విశాఖ: పలు ముఖ్యమైన రైళ్లను రద్దు చేసిన అధికారులు

image

వర్షాల వల్ల పలు రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. ఆదివారం బయలుదేరాల్సిన విశాఖ-హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్, విశాఖ సికింద్రాబాద్ గరీబ్ రథ్, విశాఖ లోకమాన్య తిలక్, విశాఖ మహబూబ్ నగర్ సూపర్ ఫాస్ట్, మహబూబ్ నగర్ విశాఖ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు వాల్తేర్ రైల్వే డివిజన్ డీసీఎం కే.సందీప్ తెలిపారు. హైదరాబాద్-షాలిమార్ ఈస్ట్ కోస్ట్, సికింద్రాబాద్-హౌరా ఫలక్ నామాను రద్దు చేశారు.

Similar News

News January 22, 2025

ఉమ్మడి విశాఖలో 29 మద్యం షాపులు కేటాయింపు

image

రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులకు ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 28 మద్యం దుకాణాలను కేటాయించింది. అనకాపల్లి జిల్లాలో గౌడ శెట్టిబలిజ యాత కులస్తులకు మొత్తం 15 దుకాణాలను కేటాయించింది. విశాఖ జిల్లాలో 14 దుకాణాలను కేటాయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లాకు ఒక్క దుకాణం కూడా కేటాయించలేదు.

News January 22, 2025

భీమిలిలో దివ్యాంగ బాలికపై అత్యాచారం

image

భీమిలి పట్టణంలో మానసిక దివ్యాంగురాలిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. మానసికస్థితి సరిగా లేకపోవడంతో పాటు పోలియోతో బాలిక మంచం పైనే ఉంటుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంగళవారం నిందితుడు బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక నానమ్మ బయటికి వెళ్లి వచ్చి చూసేసరికి నిందితుడు లోపల ఉండటంతో కేకలు వేసింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసి పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

News January 22, 2025

విశాఖ: ఆర్టీసీ సంక్రాంతి ఆదాయం రూ.2 కోట్లు

image

సంక్రాంతి సీజన్‌లో విశాఖ ఆర్టీసీకి రూ. రెండు కోట్ల ఆదాయం వచ్చినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు మంగళవారం తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 35% అదనంగా ఆదాయం వచ్చిందన్నారు. సంక్రాంతికి ముందు తర్వాత ఈనెల 21 వరకు విశాఖ ద్వారక బస్ స్టేషన్ నుంచి హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, శ్రీకాకుళం, కాకినాడ తదితర ప్రాంతాలకు బస్సులు నడిపినట్లు తెలిపారు. ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయలేదన్నారు.