News December 26, 2024

విశాఖ: పలు రైళ్లకు అదనపు కోచ్‌లు

image

సంక్రాంతి సీజన్ సందర్భంగా పలు రైళ్లకు అదనపు కోచ్‌లను జత చేస్తున్నట్లు వాల్తేరు డివిజన్ డిఆర్ఎం సందీప్ బుధవారం తెలిపారు. విశాఖ-గుణపూర్-విశాఖ పాసింజర్ స్పెషల్‌కు జనవరి ఒకటి నుంచి 31 వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ను జత చేస్తున్నారన్నారు. భువనేశ్వర్-తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్‌కు జనవరి 4 నుంచి 25 వరకు, తిరుగూ ప్రయాణంలో జనవరి 5 నుంచి 26 వరకు ఒక థర్డ్ ఏసీ కోచ్‌ను జత చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News January 26, 2025

విశాఖలో నకిలీ IAS జంటకు రిమాండ్

image

విశాఖలో IASగా చలామణి అవుతున్న వంగవేటి భాగ్యరేఖ@అమృత, మన్నెందొర చంద్రశేఖర్ జంటపై MVP పోలీసులు కేసు నమోదు చేసి శనివారం అరెస్ట్ చేసారు. న్యాయ స్థానంలో వారిని హాజరుపరచగా ఇద్దరికీ 15రోజులు రిమాండ్ విధించారు. అనేక మంది అమాయకులకు ఉద్యోగాలు కల్పిస్తామని, TIDCO ఇల్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసినట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు అడుగుతుంటే తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నట్లు బాధితులు తెలిపారు.

News January 26, 2025

జీవీఎంసీలో 1200 కేజీల ప్లాస్టిక్ సీజ్

image

జీవీఎంసీ పరిధిలో ఇప్పటివరకు 1200 కిలోల ప్లాస్టిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు జీవీఎంసీ అదనపు కమిషనర్ ఆర్.సోమన్నారాయణ తెలిపారు. జనవరి ఒకటి నుంచి జీవీఎంసీ సిబ్బంది పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిందని వెల్లడించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై తనిఖీలు నిర్వహించి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్లాస్టిక్‌ నివారణకు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు.

News January 26, 2025

గాజువాకలో ఏడుగురు అరెస్ట్

image

గాజువాక సమీపంలోని పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు పేకాట శిబిరంపై శనివారం దాడి చేశారు. వుడా కాలనీలో పేకాట ఆడుతుండగా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడులు చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న రూ.1,11,430 నగదుతో పాటు 7 మొబైల్స్ సీజ్ చేశారు. వీరిని న్యూ పోర్ట్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.