News August 29, 2024
విశాఖ: పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే అధికారులు
వివిధ కారణాలతో పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు రైల్వే డివిజన్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ -భువనేశ్వర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ వచ్చే నెల 2, 9 తేదీల్లో రద్దు చేసినట్లు పేర్కొన్నారు. భువనేశ్వర్-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌ను వచ్చే నెల 3,10 తేదీల్లో రద్దు చేసినట్లు తెలిపారు. నేడు బయలుదేరే ఒఖ-పూరీ వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా రద్దు చేసినట్లు తెలిపారు.
Similar News
News September 19, 2024
స్వర్ణాంధ్ర-2047పై సమీక్ష నిర్వహించిన విశాఖ కలెక్టర్
స్వర్ణాంధ్ర-2047పై అందరికీ అవగాహన ఉండాలని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సూచించారు. కలెక్టరేట్లో గురువారం స్వర్ణాంధ్ర-2047పై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఐదేళ్లలో సాధించబోయే ప్రగతిపై ప్రణాళికలతో కూడిన నివేదికలను రూపొందించాలన్నారు. ప్రతి ఏటా 15% ఆర్థిక పురోగతి కనిపించాలన్నారు.
News September 19, 2024
విశాఖ: 100 రోజుల పాలనపై మీ కామెంట్ ఏంటి?
ఉమ్మడి విశాఖ జిల్లాలో అరకు, పాడేరు మినహా మిగిలిన అన్ని సీట్లూ గెలిచి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు రేపటితో 100 రోజుల పాలన పూర్తి చేసుకోనుంది. ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని రేపటి నుంచి ఈనెల 26 వరకు MLAలు ప్రజలకు వివరించనున్నారు. పెన్షన్ పెంపు, ఫ్రీ ఇసుక వంటి హామీలను అమలు చేశామని కూటమి చెబుతుండగా, పాలన అట్టర్ ఫ్లాప్ అని YCP విమర్శిస్తోంది. మరి 100 రోజుల కూటమి పాలనలో, మీ MLA పనితీరుపై మీ కామెంట్..
News September 19, 2024
భీమిలి: కూల్చివేతలపై స్టేకు హైకోర్టు నిరాకరణ
భీమిలి బీచ్‌లో MP విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి చేపట్టిన అక్రమ నిర్మాణాలన్నింటిని కూల్చివేయాలని జీవీఎంసీని హైకోర్టు ఆదేశించింది. కూల్చివేతలపై స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. రాజకీయ జోక్యంతో కూల్చివేతలను ఆపవద్దని సూచించింది. ఫొటోలను పరిశీలిస్తే బీచ్‌లోనే నిర్మాణాలు చేసినట్లు స్పష్టం అవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది.