News June 11, 2024
విశాఖ: పలు రైళ్లును దారి మళ్లించిన రైల్వే అధికారులు

సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ డివిజన్ ముస్తాబాద్-గన్నవరం సెక్షన్ మధ్య భద్రతాపరమైన ఆధునీకరణ పనులు కారణంగా పలు రైళ్లును దారి మల్లించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కే.సందీప్ పేర్కొన్నారు.
ఎర్నాకులం-పాట్నా (22643 ) సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఈనెల 11, 17, 18, 24, 25 తేదీల్లో, ఎస్‌న్‌వి బెంగళూరు- గువాహటి (125509) సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఈనెల 14, 21, 28 తేదీల్లో దారి మళ్లించనున్నారు.
Similar News
News March 23, 2025
విశాఖలో సందడి చేసిన చిత్రబృందం

విశాఖలో “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” చిత్రబృందం సందడి చేశారు. ఆదివారం విశాఖలో ఒక హోటల్లో మీడియా సమావేశంలో హీరో ప్రదీప్ మాట్లాడారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా ఇది సిద్ధమవుతోందన్నారు. వేసవిలో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ ఎట్రాక్షన్‌గా ఏప్రిల్ 11న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉందన్నారు. ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాయని వివరించారు. హీరోయిన్ దీపికా ఉన్నారు.
News March 23, 2025
నేడు విశాఖ రానున్న గవర్నర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆదివారం విశాఖ రానున్నారు. సాయంత్రం 8:55 విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రుషి కొండ వద్ద ఉన్న ఓ హోటల్‌కు చేరుకుంటారు. రాత్రికి అక్కడ బస చేస్తారు. సోమవారం విశాఖలో ఉండి మంగళవారం సాయంత్రం విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి విజయవాడ వెళ్తారు. వీటికి తగ్గట్టు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
News March 23, 2025
విశాఖలో రేపే మ్యాచ్..

దేశంలో IPL ఫీవర్ స్టార్ట్ అయింది. శనివారం నుంచి మ్యాచ్‌లు మొదలు కాగా క్రికెట్ అభిమానులు ఉర్రూతలూగుతున్నారు. కాగా ఈ ఏడాది విశాఖ 2 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం విశాఖలో జరిగే ఢిల్లీ- లక్నో మ్యాచ్‌కు ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు ACA తెలిపింది. రేపు సాయంత్రం 6.30 నుంచి మెగా సెలబ్రేషన్స్‌తో విశాఖలో ఐపీఎల్ సందడి మొదలు కానుంది. రాత్రి 7.30కు మ్యాచ్ ప్రారంభమవుతుంది.