News May 21, 2024

విశాఖ: పలు రైళ్లు రద్దు

image

విజయవాడ డివిజన్ పరిధిలో భద్రతాపరమైన పనులు జరుగుతున్న కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు రైల్వే అధికారులు తెలిపారు. మచిలీపట్నం – విశాఖ రైలు ఏప్రిల్ 27 నుంచి మే 22 వరకు, విశాఖ – మచిలీపట్నం రైలును ఈనెల 28 నుంచి వచ్చే నెల 23 వరకు, గుంటూరు – విశాఖ సింహాద్రి ఎక్స్ప్రెస్ 27 నుంచి వచ్చే నెల 22 వరకు.. విశాఖ – గుంటూరు సింహాద్రి ఎక్స్ప్రెస్ ఈనెల 28 నుంచి వచ్చే నెల 23 వరకు రద్దు చేశారు.

Similar News

News December 12, 2024

వైభవంగా సింహాద్రి అప్పన్న తిరువీధి ఉత్సవం

image

ఏకాదశి పురస్కరించుకొని సింహాచలం సింహాద్రి అప్పన్న తిరువీధి ఉత్సవాన్ని బుధవారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేతంగా గోవిందరాజు స్వామిని అలంకరించి వాహనంలో అధిష్టింప చేసి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల మధ్య మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు పలువురు స్వామిని దర్శించుకున్నారు.

News December 12, 2024

ఉమ్మడి విశాఖ జిల్లా అధికారులతో సీఎం చంద్రబాబు డిన్నర్

image

రెండో విడ‌త జిల్లా కలెక్టర్ల కాన్ఫ‌రెన్స్‌లో భాగంగా బుధవారం వెల‌గ‌పూడి స‌చివాల‌యంలోని ఉమ్మడి విశాఖ జిల్లా అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన స‌మావేశమాయ్యారు. కలెక్టర్ల సదస్సు అనంతరం ఉమ్మడి విశాఖ జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్, ఎస్‌పీలు, ఇతర అధికారులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు డిన్నర్ చేశారు. కార్యక్రమంలో హోంమంత్రి అనిత ఉన్నారు.

News December 11, 2024

విశాఖ: పలు రైళ్లను రద్దు చేసిన అధికారులు

image

వచ్చేనెల 2 నుంచి 8 వరకు విశాఖ- రాయపూర్ ప్రత్యేక ప్యాసింజర్ రైలు, 3 నుంచి 9 వరకు రాయపూర్-విశాఖ పాసింజర్ రైలును రద్దు చేసినట్లు వాల్తేర్ డీసీఎం కే.సందీప్ బుధవారం పేర్కొన్నారు. 3 నుంచి 8 వరకు విశాఖ-భవానిపట్నం స్పెషల్ పాసింజర్, విశాఖ-దుర్గ్ ఎక్స్‌ప్రెస్, 4 నుంచి 9 వరకు భవానిపట్నం- విశాఖ ప్యాసింజర్, 3 నుంచి 8 వరకు దుర్గ్-విశాఖ ఎక్స్‌ప్రెస్ రద్దు చేసినట్లు తెలిపారు.