News April 11, 2024
విశాఖ: పలు రైళ్లు రద్దు

ప్రీ-నాన్ -ఇంటర్లాకింగ్, నాన్ -ఇంటర్లాకింగ్ పనుల కారణంగా పలు రైళ్లు రద్దు చేస్తునట్లు రైల్వే శాఖ అధికారి ఏ.కె. త్రిపాఠి తెలిపారు. 08527 విశాఖ- రాయ్ పూర్, 08528 రాయ్‌పూర్ -విశాఖ, 08504 విశాఖ-భవానీపట్నం ప్యాసింజర్, 18301 సంబల్పూర్ – రాయగడ, 18302 రాయగడ -సంబల్పూర్ ఇంటర్ సిటీని ఈనెల 15 నుంచి 24వ తేదీ వరకు… 08503 భవానీపట్న-విశాఖ ప్యాసింజర్ ఈనెల 16 నుంచి 25వ వరకు రద్దు చేసినట్లు తెలిపారు.
Similar News
News April 10, 2026
బెట్టింగ్ యాప్ ప్రమోట్.. విశాఖలో ఇద్దరి అరెస్ట్

విశాఖలోని బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న ఓ కళాశాల ఫుట్బాల్ కోచ్ గణేశ్‌తో పాటు అనిల్ కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. వీరిద్దరూ మధురవాడ భగవాన్ దాస్ కాలనీ ప్రాంతానికి చెందిన వారే. విశాలాక్షి నగర్‌లో యువకుడ్ని క్రికెట్ ప్రిడిక్షన్ అంటూ నమ్మించి బెట్టింగ్ యాప్‌ను ప్రోత్సహించారు. వీరి మాటలు నమ్మిన యువకుడు రూ.12.50 లక్షలు పోగొట్టుకున్నాడు.
News April 9, 2026
విశాఖ: ఇరాన్ విద్యార్థులకు ఆర్థిక సాయం చేసిన కలెక్టర్

యుద్ధ నేపథ్యంలో ఏర్పడిన క్లిష్ట పరిస్థితులను వివరిస్తూ ఆర్థిక సాయం కోరిన ఇరాన్ విద్యార్థులకు కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. జిల్లా సంజీవని నిధి నుంచి రూ.50 వేలు విలువ గల చెక్కును, కనకమహాలక్ష్మి దేవస్థానం సమకూర్చిన రూ.50 వేలు నగదును కలెక్టర్ తన ఛాంబర్లో గురువారం అందించారు. ఏయూలో ఫార్మసీ కోర్సు చదువుతున్న జినాబ్, సోల్మాజ్ బుధవారం వినతి అందజేశారు.
News April 9, 2026
చందనోత్సవం.. ‘గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఏర్పాట్లు’

సింహాచలంలో ఈనెల 20న జరగనున్న చందనోత్సవ ఏర్పాట్లను కలెక్టర్ అభిషేక్త్ కిషోర్ గురువారం పరిశీలించారు. చందనోత్సవ కార్యక్రమంలో లక్షల మంది భక్తులు, ప్రజాప్రతినిధులు హాజరవుతున్న నేపథ్యంలో క్యూలైన్లు, పార్కింగ్, మౌలిక వసతుల ఏర్పాట్లు స్వయంగా పరిశీలించారు. ఈవో వెంకట్రావు జరుగుతున్న పనులు, చేపడుతున్న భద్రతా చర్యలను కలెక్టర్‌కు వివరించారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.


