News April 12, 2024

విశాఖ: పలు రైళ్లు రీ షెడ్యూల్

image

పలు రైళ్లును రీ షెడ్యూల్ చేసిన డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ.కె.త్రిపాఠి పేర్కొన్నారు. నిజాముద్దీన్-విశాఖ(12808) ఎక్స్‌ప్రెస్ రైలును ఈనెల 15, 18 తేదీల్లో ఒక గంట ఆలస్యంగా 8 గంటలకు రీషెడ్యూల్ చేశారు. విశాఖ-భగత్ కీ కోఠి (18573)ను ఈనెల 18న 2గంటల 30నిమిషాల ఆలస్యంగా రాత్రి 7.50 గంటలకు రీషెడ్యూల్ చేశారు. నిజాముద్దీన్-విశాఖ12808) ఎక్స్ ప్రెస్ ఈ నెల 22న 2గంటల ఆలస్యంగా 9గంటలకు రీషెడ్యూల్ చేశారు.

Similar News

News October 22, 2025

గంటా శ్రీనివాస్ జోక్యంతో ఫుట్ ఓవర్ బ్రిడ్జికి గ్రీన్ సిగ్నల్

image

చంద్రంపాలెం ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి మెట్రో ఆమోదం తెలిపింది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చొరవతో మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రూ.3.23 కోట్లతో నిర్మించే ఈ బ్రిడ్జి నిర్మాణంపై మెట్రో అధికారులు అభ్యంతరం చెప్పారు. దీంతో గంటా సమస్యను వివరించి మెట్రో డిజైన్‌ను బ్రిడ్జి కంటే ఎత్తులో ఖరారు చేయించారు.

News October 21, 2025

పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచండి: మేయర్

image

అంతర్జాతీయ కార్యక్రమాలకు విశాఖను సుందరీకరించండని మేయర్ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. కార్మికుల హాజరును పరిశీలించి, వారి వేతనాలను సకాలంలో చెల్లించాలన్నారు. బీచ్ రోడ్డులో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి ఎక్కువ మంది కార్మికులను నియమించాలని, గైర్హాజరైన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. బీచ్‌లో అదనంగా టాయిలెట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.

News October 21, 2025

వ్యాపారులు డస్ట్ బిన్‌లు ఉపయోగించాలి: జీవీఎంసీ కమిషనర్

image

వ్యాపారులు దుకాణాల ముందు డస్ట్ బిన్లు ఉపయోగించాలని, లేనియెడల వారి లైసెన్సులు రద్దు చేస్తామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ హెచ్చరించారు. మంగళవారం ఆరిలోవలో పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. మాంసం, పూల వ్యాపారులు వ్యర్థాలను రోడ్లపై వేయడంతో వారిచేత క్లీన్ చేయించారు. టిఫిన్ సెంటర్ వద్ద డస్ట్ బిన్ లేకపోవడంతో రూ.1000 అపరాధ రుసుమును వసూలు చేయాలని శానిటరీ ఇన్‌స్పెక్టర్‌‌ను ఆదేశించారు.