News July 10, 2024

విశాఖ: పలు రైళ్లు రీ షెడ్యూల్

image

వాల్తేర్ రైల్వే డివిజన్ పుండి-నౌపడ సెక్షన్‌లో భద్రతపరమైన ఆధునీకరణ పనులు కారణంగా ఈనెల 11,13 తేదీలలో పలు రైళ్ల బయలుదేరే సమయాలు మార్చడంతోపాటు కొన్నింటి గమ్యాలు కుదించినట్లు వాల్తేరు డీసీఎం కె.సందీప్ తెలిపారు. ఈనెల 11న, ట్రైన్ నెంబర్ 12830, 22879 గల రైలు 45 నిమిషాల పాటు ఆలస్యంగా బయలుదేరుతాయి. సంత్రగచ్చి-విశాఖ ఎక్స్‌ప్రెస్ 6 గంటల ఆలస్యంగా బయలుదేరుతుంది. ఈ విషయాన్ని గమనించాలని ప్రయాణికులను కోరారు.

Similar News

News September 30, 2024

విశాఖ: ‘ఓటుహక్కు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలి’

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు అర్హులైన ఉపాధ్యాయులందరూ ఓటు హక్కు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. సోమవారం నోటిఫికేషన్ వెలువడిందన్నారు. ఓటు నమోదు ప్రక్రియ కూడా ప్రారంభమైందని నవంబర్ 6 వరకు కొనసాగుతుందన్నారు. నవంబర్ 23న డ్రాఫ్ట్ పబ్లిష్ అవుతుందన్నారు. 23 నుంచి డిసెంబర్ 9 వరకు అభ్యంతరాల స్వీకరణ, 30న తుది జాబితా ప్రకటిస్తామన్నారు. >Share it

News September 30, 2024

విశాఖ కేజీహెచ్ నుంచి విద్యార్థి పరారీ..!

image

డౌనూరు ఆశ్రమ పాఠశాల విద్యార్థి కే.సురేష్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు కొయ్యూరు ఏటీడబ్ల్యూవో క్రాంతి కుమార్ చొరవ తీసుకుని కేజీహెచ్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే విద్యార్థి సోమవారం ఆసుపత్రి నుంచి పరారయ్యాడని ఏటీడబ్ల్యూవో తెలిపారు. నాటువైద్యం చేయించడానికి తల్లిదండ్రులు స్వగ్రామమైన కుడిసింగి తీసుకెళ్లి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

News September 30, 2024

సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయం రూ.1.39 కోట్లు

image

సింహాచలం సింహాద్రి అప్పన్న హుండీల ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. హుండీల ద్వారా 28 రోజులకు రూ.1,39,44,045 నగదు లభించింది. భక్తులు కానుకల రూపంలో వేసిన బంగారం 53 గ్రాముల 200 మి. గ్రాములు, వెండి 8 కిలోల 650 గ్రాముల 500 మి.గ్రా. లభించింది. అలాగే యూఎస్ఏ డాలర్లు 77, కెనడా డాలర్లు 20, సింగపూర్ డాలర్లు 30, యూఏఈ దిరమ్స్ 130తో పాటు వివిధ దేశాల కరెన్సీ లభించింది.