News July 12, 2024

విశాఖ: పవన్ కళ్యాణ్‌కు విశ్రాంత ఐఏఎస్ లేఖ

image

విశాఖ ముడసర్లోవ పార్కులో నిర్మాణాలు చేపట్టడం పర్యావరణానికి హానికరమని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు లేఖ రాశారు. రిజర్వాయర్ ‌కు ఆనుకుని ఉన్న పార్కు ప్రదేశంలో 105 రకాల పక్షులను శాస్త్రవేత్తలు గుర్తించారని పేర్కొన్నారు. అలాంటి ప్రాంతంలో జీవీఎంసీ భవనాల నిర్మాణానికి 228 చెట్లను తరలించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కట్టడాలు నిర్మించడం చట్ట విరుద్ధం అన్నారు.

Similar News

News November 25, 2025

ఫార్మా బస్సులకు గాజువాకలోకి నో ఎంట్రీ

image

గాజువాకలో ట్రాఫిక్ సమస్య తీవ్రతరం కావడంతో ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫార్మా కంపెనీ బస్సులు అధిక సంఖ్యలో సిటీలోకి రావడంతో సమస్య అధికమైందని, వాటిని నేటి నుంచి అనుమతించబోమన్నారు. ఇప్పటికే యజమానులు, డ్రైవర్లకు సమాచారమిచ్చామన్నారు. గాజువాకకు రెండు కి.మీ దూరంలో ఉన్న శ్రీనగర్ జంక్షన్ వరకు మాత్రమే ఫార్మా బస్సులకు అనుమతి ఉంటుందని వివరించారు

News November 25, 2025

విశాఖ: ‘లింగ ఆధారిత వివక్షపై నివార‌ణ చర్య‌ల‌ను బ‌లోపేతం చేయాలి’

image

లింగ ఆధారిత వివ‌క్ష‌పై పోరాటం చేసేందుకు పౌరులంద‌రిలో బాధ్య‌త పెర‌గాల‌ని క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్రసాద్ సూచించారు. సోమవారం ఆయన ఇందుకు సంబంధించిన పోస్టులను ఆవిష్కరించారు. మంగళవారం నుంచి డిసెంబ‌ర్ 23 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న జెండ‌ర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మార్పు కోసం ముందడుగు అనే నినాదంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.