News November 26, 2024

విశాఖ: పాఠశాలలో హోమో సెక్సువల్ వేధింపులు..!

image

విశాఖలోని నరవ గురుకుల పాఠశాలలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పాఠశాల అటెండర్ నీచంగా విద్యార్థులతో ప్రవర్తించాడని ఆరోపణలొస్తున్నాయి. అటెండర్ లోకేష్ విద్యార్థులను హోమో సెక్సువల్ వేధింపులకు గురిచేశారని విద్యార్థులు ఆరోపించారు. జరిగిన ఘటనపై విద్యార్థులు ప్రిన్సిపల్‌కు మంగళవారం ఫిర్యాదు చేశారు. పోలీసులకు సమాచారం అందడంతో దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News December 6, 2024

విశాఖలో సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే

image

 సీఎం చంద్రబాబు విశాఖ పర్యనటలో భాగంగా శుక్రవారం పలు కార్యక్రమాల్లో పాల్గోనున్నారు. మొదటి పార్టీ కార్యాలయంలో జరిగే అంబేడ్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కొంతసేపు పార్టీ నాయకులను, కార్యకర్తలతో భేటీ అవుతారు. 9:30 నిమిషాలకు నోవాటెల్‌లో “డీప్ టెక్నాలజీ సదస్సు- 2024″లో పాల్గొంటారు. సాయంత్రం వీఎంఆర్డీఏ అధికారులతో భేటీ అవుతారు. అనంతరం 06:45 ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని తిరిగి విజయవాడ వెళ్తారు. 

News December 6, 2024

విశాఖ: NAD కొత్త రోడ్డులో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

విశాఖ పరిధి NAD కొత్త రోడ్డులో గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్‌ ఢీ కొట్టడంతో అడ్వకేట్ మృతి చెందారు. మృతుడు మర్రిపాలెం ఉడా కాలనీకి చెందిన పోతుల సూర్యనారాయణగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం KGHకి తరలించారు.

News December 6, 2024

విశాఖ: కామాంధునికి పాతికేళ్ల జైలు శిక్ష

image

బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన కామాంధునికి విశాఖపట్నం పోక్సో కోర్టు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెల్లడించింది. తీర్పులో భాగంగా నిందితునికి 25 సంవత్సరాల కారాగార శిక్షతో పాటు రూ.1,25,000 జరిమానా విధించింది. సబ్బవరం మండలానికి చెందిన ఓ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిని కోర్టులో ప్రవేశపెట్టగా శిక్ష విధించారు.