News December 29, 2024
విశాఖ-పార్వతీపురం రైలు ఆగనున్న స్టేషన్లు ఇవే..!

సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ విశాఖపట్నం నుంచి పార్వతీపురానికి కొత్తగా నడపనున్న రైలు 9 రైల్వే స్టేషన్లలో ఆగనుంది. విశాఖలో ఉదయం 10 గంటలకు బయలుదేరి సింహాచలం, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, గజపతినగరం, కోమటిపల్లి, డొంకినవలస, బొబ్బిలి, సీతానగరం రైల్వే స్టేషన్లలో ఆగి మధ్యాహ్నం 12.20 గంటలకు పార్వతీపురం చేరుకుంటుంది. తిరిగి 12.45కు బయలుదేరి సాయంత్రం 4కి విశాఖ చేరుకుంటుంది. >Share it
Similar News
News October 17, 2025
పుణ్యక్షేత్రాలకు విజయనగరం నుంచి ప్రత్యేక బస్సులు

కార్తీక మాసంలో భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. అమరావతి, పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోట పంచారామాల దర్శనానికి అక్టోబర్ 26, నవంబర్ 2, 9, 16 తేదీల్లో బస్సులు నడుస్తాయని, సూపర్ లగ్జరీ రూ.2000, అల్ట్రా డీలక్స్ రూ.1950గా చార్జీలు నిర్ణయించామన్నారు. టిక్కెట్లు www.apsrtconline.in లేదా సమీప డిపోలో లభ్యమన్నారు.
News October 17, 2025
విజయనగరం ఎంప్లాయిస్ గ్రీవెన్స్‌కు 27 ఫిర్యాదులు

కలెక్టరేట్లో ఉద్యోగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఎంప్లాయిస్ గ్రీవెన్స్‌లో 27 ఫిర్యాదులు అందినట్లు కలెక్టర్ రాం సుందర్ రెడ్డి తెలిపారు. ట్రెజరీ, డ్వామా, ఈపీడీసీఎల్, మెడికల్ విభాగాలకు చెందిన ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన తెలిపారు. గత శుక్రవారం అందిన 40 ఫిర్యాదుల్లో చాలావరకు పరిష్కారమయ్యాయని వెల్లడించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
News October 17, 2025
గంజాయి కేసులో వ్యక్తికి మూడేళ్ల జైలు: VZM SP

2022లో 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన గంజాయి కేసులో అస్సాం రాష్ట్రానికి చెందిన నిందితుడు ఆకాష్ ఖూడా (22)కు మూడేళ్ల జైలు, రూ.10 వేల జరిమానా విధిస్తూ విజయనగరం ఫస్ట్ అడిషనల్ సెషన్స్ జడ్జి ఎం.మీనాదేవి శుక్రవారం తీర్పు వెలువరించారు. ఈ కేసులో నిందితుడిపై నేరం రుజువుకావడంతో శిక్ష పడిందని ఎస్పీ దామోదర్ తెలిపారు. అదే కేసులో మరో ఇద్దరు నిందితులపై వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు.