News July 19, 2024

విశాఖ: పిల్లలను బెదిరించే ప్రయత్నంలో తండ్రి మృతి

image

‘మీరు అల్లరి చేస్తే నేను చచ్చిపోతా’ అంటూ పిల్లల అల్లరిని మాన్పించడానికి ఓ తండ్రి చేసిన ప్రయత్నం ఆతని ప్రాణాలనే తీసింది. ఈ ఘటన గోపాలపట్నంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన చందన్ కుమార్(33) పిల్లలు డబ్బులు చించేయడంతో వారిపై కోప్పడగా భార్య అడ్డు పడింది. దీంతో చందన్ ఫ్యాన్‌కు చీరకట్టి పిల్లలను భయపెట్టే ప్రయత్నం చేశారు. అదికాస్తా బిగుసుకుపోయి అతని ప్రాణాలు తీసింది.

Similar News

News December 5, 2024

అనకాపల్లి: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

image

అనకాపల్లి జిల్లా పరిధిలో నేషనల్ హైవే, స్టేట్ హైవేలపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు SDPO శ్రావణి పేర్కొన్నారు. ఈ మేరకు అనకాపల్లి నేషనల్ హైవే పై బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి ప్రమాదాలు జరగడానికి గల కారణాలను విశ్లేషించారు. లోటుపాట్లను తెలుసుకొని వాటిని సరిదిద్ది ప్రమాదాల నివారణకు వివిధ శాఖల అధికారుల సమన్వయంతో కృషి చేస్తామన్నారు.

News December 4, 2024

సీఎం చంద్రబాబు విశాఖ పర్యటన షెడ్యూల్

image

ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 5న విశాఖ రానున్న విషయం తెలిసిందే. విశాఖలో సీఎం పర్యటన షెడ్యూల్‌ను సీఎంవో తెలిపింది. ఈనెల 5న సాయంత్రం 9.40 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్ కు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. 6వ తేదీన విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలపై సీఎం సమీక్షిస్తారు.

News December 4, 2024

విశాఖ-చెన్నై ఎగ్మోర్-విశాఖ స్పెషల్ రైళ్లు

image

ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ-చెన్నై ఎగ్మోర్-విశాఖ స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు డీసీఎం కె.సందీప్ తెలిపారు. విశాఖ చెన్నై ఎగ్మోర్ స్పెషల్ ట్రైన్ ఈనెల 7 నుంచి వచ్చే ఏడాది మార్చి 1వ తేదీ వరకు ప్రతి శనివారం నడుపుతున్నట్లు తెలిపారు. తిరుగు ప్రయాణంలో చెన్నై ఎగ్మోర్ నుంచి విశాఖకు ఈనెల 8 నుంచి మార్చి 2వ తేదీ వరకు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుందన్నారు.