News September 18, 2024
విశాఖ: ‘పిల్లల ఉజ్వల భవిష్యత్కు ఎన్.పి.ఎస్ వాత్సల్య’

పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఎన్.పి.ఎస్ వాత్సల్య యోజన పథకం ఎంతో దోహదపడుతుందని ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ పంకజ్ కుమార్ అన్నారు. ఢిల్లీలో ఈ పథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సాయంత్రం ప్రారంభించారు. సిరిపురం వద్ద ఎస్బీఐ పరిపాలన విభాగంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ పథకం దీర్ఘకాలంలో సంపదను సృష్టిస్తుందన్నారు.
Similar News
News November 25, 2025
విశాఖ: ఐఫోన్ కొనివ్వలేదని బాలుడి సూసైడ్

ఐఫోన్ కొనివ్వలేదని తల్లిదండ్రుల మీద అలిగి బాలుడు(17) ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలో సోమవారం జరిగింది. పోలీసుల కథనం.. ఆరో తరగతి వరకు చదువుకున్న బాలుడు చదువు మానేసి ఇంట్లోనే ఉండేవాడు. తల్లిదండ్రులు కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషించేవారు. ఐఫోన్ కావాలని తండ్రితో గొడవ పడి ఇంటికి రావడం మానేశాడు. కాగా సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటికి వచ్చి ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
News November 25, 2025
ఫార్మా బస్సులకు గాజువాకలోకి నో ఎంట్రీ

గాజువాకలో ట్రాఫిక్ సమస్య తీవ్రతరం కావడంతో ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫార్మా కంపెనీ బస్సులు అధిక సంఖ్యలో సిటీలోకి రావడంతో సమస్య అధికమైందని, వాటిని నేటి నుంచి అనుమతించబోమన్నారు. ఇప్పటికే యజమానులు, డ్రైవర్లకు సమాచారమిచ్చామన్నారు. గాజువాకకు రెండు కి.మీ దూరంలో ఉన్న శ్రీనగర్ జంక్షన్ వరకు మాత్రమే ఫార్మా బస్సులకు అనుమతి ఉంటుందని వివరించారు
News November 25, 2025
విశాఖ: ‘లింగ ఆధారిత వివక్షపై నివారణ చర్యలను బలోపేతం చేయాలి’

లింగ ఆధారిత వివక్షపై పోరాటం చేసేందుకు పౌరులందరిలో బాధ్యత పెరగాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సూచించారు. సోమవారం ఆయన ఇందుకు సంబంధించిన పోస్టులను ఆవిష్కరించారు. మంగళవారం నుంచి డిసెంబర్ 23 వరకు జరగనున్న జెండర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మార్పు కోసం ముందడుగు అనే నినాదంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.


