News July 18, 2024
విశాఖ: పెరిగిన టమాటా ధర..

విశాఖలో టమాటా రేటు మరోసారి భారీగా పెరిగింది. వారం క్రితం కిలో రూ.40 కి విక్రయించిన టమాటా బుధవారం ఒక్కసారిగా కిలో రూ.67కి చేరింది. బయట మార్కెట్లో మరింత పెరిగి కిలో రూ.100 వరకు విక్రయిస్తున్నారు. మదనపల్లి మార్కెట్ కు తక్కువ మొత్తంలో టమాటా రావడం వల్ల ధర పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రభుత్వం రాయితీపై టమాటాను రైతు బజార్లలో విక్రయించాలని వినియోగదారులు కోరుతున్నారు.
Similar News
News December 11, 2025
రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం అందజేత: విశాఖ సీపీ

విశాఖ సీపీ కార్యాలయంలో రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా గురువారం పరిహారం అందజేశారు. హిట్ అండ్ రన్ కేసులో మరణించిన పెద్దింటి లక్ష్మీనారాయణ భార్య పెద్దింటి రంగమ్మకు రూ.2 లక్షలు జమ చేశామన్నారు. ఇప్పటి వరకు విశాఖ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసుల్లో 101 మంది బాధితులకు మొత్తం రూ.82లక్షలు అందించినట్లు చెప్పారు.
News December 11, 2025
విశాఖలో రూ.307 కోట్లతో రోడ్ల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్

విశాఖలో రూ.306.95 కోట్లతో 88.35 కి.మీ. మేర రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM)లో ఈ పనులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా కమిషనర్ కేతన్ గార్గ్ గురువారం జోన్-2లోని కార్ షెడ్ -పీఎం పాలెం రోడ్డును పరిశీలించి కార్యాచరణ ప్రారంభించారు. రోడ్లను ఆధునిక వసతులు, పచ్చదనంతో సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.
News December 11, 2025
జీవీఎంసీలో గ్రామాల విలీనం సరికాదు: బొలిశెట్టి సత్యనారాయణ

గ్రామాలను జీవీఎంసీలో విలీనం చేయడం సరైంది కాదని జనసేన నాయకుడు బోలిశేట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. గ్రామ స్వరాజ్యం ప్రజల రాజ్యాంగ బద్ధమైన హక్కుఅని, ప్రజల అభిప్రాయం లేకుండా గ్రామాలను కార్పొరేషన్లో కలపడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన అన్నారు. ప్రజల భవిష్యత్తు కొంతమంది రాజకీయనాయకుల ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టడం కుదరదన్నారు.


