News July 18, 2024
విశాఖ: పెరిగిన టమాటా ధర..
విశాఖలో టమాటా రేటు మరోసారి భారీగా పెరిగింది. వారం క్రితం కిలో రూ.40 కి విక్రయించిన టమాటా బుధవారం ఒక్కసారిగా కిలో రూ.67కి చేరింది. బయట మార్కెట్‌లో మరింత పెరిగి కిలో రూ.100 వరకు విక్రయిస్తున్నారు. మదనపల్లి మార్కెట్ కు తక్కువ మొత్తంలో టమాటా రావడం వల్ల ధర పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రభుత్వం రాయితీపై టమాటాను రైతు బజార్‌లలో విక్రయించాలని వినియోగదారులు కోరుతున్నారు.
Similar News
News December 10, 2024
విశాఖ: హస్టల్ నుంచి నలుగురు విద్యార్థులు పరార్
అల్లిపురం మహారాణిపేట పోలీసు పరిధి, అంథోని బోర్డింగ్ హోమ్ నుంచి నలుగురు విద్యార్థులు పరారైనట్లు హోమ్ ఇన్‌ఛార్జ్ కచ్చా వేళంగిరి ఫిర్యాదు చేశారు. సోమవారం ప్రార్థనలకు చర్చికి వెళ్లిన గుడాల రఘ, బెడపాటి చరణ్, నక్కాల కిరణ్ కుమార్, కార్తీక్ సాయంత్రం అయిన రాలేదు. సీసీ కెమెరాలు పరిశీలించగా గోడ దూకి పారిపోయినట్లు గుర్తించారు. విశాఖ ఆర్టీసీ బస్టాండ్, రైల్వే, ఆర్కే బీచ్ తదితర ప్రాంతాల్లో వెదికారు.
News December 10, 2024
సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయం రూ.2.81కోట్లు
సింహాద్రి అప్పన్నకు భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలు 39 రోజులకు గాను ఆలయ అధికారులు ఈఓ త్రినాథ్ రావు పర్యవేక్షణలో సోమవారం లెక్కించారు. మొత్తం రూ.2,81,93,913 ఆదాయం వచ్చింది. బంగారం 126 గ్రాముల 300 మిల్లీగ్రాములు, వెండి 15 కిలోల 140 గ్రాములు, 9దేశాల విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, సేవా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
News December 9, 2024
విశాఖ డైరీకి పూర్వ వైభవం తెస్తాం: స్పెషల్ హౌస్ కమిటీ
విశాఖ డైరీ అక్రమాలపై ఏర్పాటు చేసిన స్పెషల్ హౌస్ కమిటీ సోమవారం కలెక్టరేట్‌లో రివ్యూ జరిపింది. మేనేజంగ్ డైరెక్టర్ గారు కంపెనీపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని, త్రిప్ట్ సొసైటీ ద్వారా నిధుల మల్లింపు ఆరోపణలపైన కూడా వివరం కోరామని అన్నారు. రైతులకు న్యాయం చేసి రాజకీయాలకు అతీతంగా డెయిరీని అభివృద్ధి చేయడమే ఈ హౌసింగ్ కమిటీ లక్ష్యమని అన్నారు. అధికారులు సహకరిస్తే సాధ్యమని తెలిపారు.