News June 17, 2024

విశాఖ పోర్టు పనితీరును ప్రశంసించిన మాజీ ఎంపీ

image

విశాఖ పోర్టు పనితీరును బీజేపీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అభినందించారు. విశాఖ పోర్టు కార్యాలయంలో పోర్టు అథారిటీ చైర్మన్ అంగముత్తుతో భేటీ అయ్యారు. పోర్ట్ అథారిటీ అత్యుత్తమ పనితీరును కనబరుస్తూ ముందుకు వెళుతుండడం విశాఖకు గర్వకారణం అన్నారు. గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో గణనీయమైన మెరుగుదలను చూపించడానికి కారణమైన పోర్టు ఛైర్మన్‌ను మాజీ ఎంపీ అభినందించారు.

Similar News

News January 19, 2026

విశాఖ: టీడీపీలో వర్గ విభేదాలు బహిర్గతం

image

జీవీఎంసీ 86వ వార్డు TDPలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. NTR వర్ధంతి సందర్భంగా కూర్మన్నపాలెం కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద వార్డు కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు ఒక వర్గంగా, వార్డు అధ్యక్షుడు నల్లూరి సూర్యనారాయణ మరో వర్గంగా విడిపోయి పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మద్దతుతో వార్డు అధ్యక్షుడు తన పట్టును పెంచుకుంటున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

News January 19, 2026

విశాఖ వ్యాలీ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

విశాఖ వ్యాలీ జంక్షన్ దగ్గర సిగ్నల్ పాయింట్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. రోడ్డు క్రాస్ చేస్తున్న వ్యక్తిని బైక్ ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 19, 2026

నేటి నుంచి ఏయూలో తరగతులు పున:ప్రారంభం

image

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నేటి నుంచి తరగతులు పున:ప్రారంభం కానున్నాయి. క్రిస్మస్, సంక్రాంతి సెలవుల నేపథ్యంలో దాదాపు నెల రోజులపాటు విద్యార్థులకు సెలవులను ఇచ్చారు. పండుగ సెలవుల అనంతరం ఈరోజు నుంచి పూర్తిస్థాయిలో విశ్వవిద్యాలయంలో తరగతులు ప్రారంభం అవుతున్నాయి. ఐదు రోజులుగా బోధనేతర సిబ్బందికి సైతం పండగ సెలవులు లభించాయి దీంతో విశ్వవిద్యాలయం బోసిపోయింది. నేటి నుంచి పూర్తిస్థాయిలో వర్సిటీ పనిచేస్తుంది.