News May 20, 2024
విశాఖ: పోలింగ్‌లో రాష్ట్రంలోనే కొత్త రికార్డు

విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ పరిధిలో మొత్తం 14 వార్డులు ఉన్నాయి. 90వ వార్డులోని 213 బూత్‌లో అత్యల్పంగా 7.74% పోలింగ్ నమోదు కాగా(620 మంది ఓటర్లుండగా కేవలం 48మంది ఓటేశారు).. 56వ వార్డులో 180 బూత్‌లో అత్యధికంగా 84.43% పోలింగ్ నమోదయింది. ఈ నియోజకవర్గంలో 69.78 శాతం పోలింగ్ నమోదయింది. గత ఎన్నికలతో పోలిస్తే 11.59% అధికంగా పోలింగ్ జరిగింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా ఒక కొత్త రికార్డు.
Similar News
News February 22, 2026
28న GVMC కౌన్సిల్ చివరి సమావేశం

GVMC కౌన్సిల్ సమావేశం ఈనెల 28న జరగనుంది. 37 అంశాలతో అజెండాను సిద్ధం చేసి కార్పొరేటర్లకు అందజేశారు. విద్యుత్ విభాగంలోని ఒప్పంద కార్మికులను కొనసాగించేందుకు వేతనాల మంజూరు ప్రతిపాదించారు. పారిశుద్ధ్యం, భూగర్భ మురుగునీటి విభాగ కార్మికులకు పెంచిన వేతనాలు అమలు చేయనున్నారు. 81వ వార్డులో పైపులైన్ల మార్పు, 95వ వార్డులో రిటైనింగ్ వాల్, 1వ వార్డులో కాలువలు, 71వ వార్డులో బీటీ రహదారి పనులు అజెండాలో చేర్చారు.
News February 22, 2026
విశాఖ: పాత కక్షలతో కత్తితో దాడి..

జగదాంబ జంక్షన్ వద్ద శనివారం రాత్రి రౌడీషీటర్ అప్పులరాజుపై ఆటో డ్రైవర్ కత్తితో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. పాత గొడవల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కేసు నమోదు చేసిన మహారాణిపేట పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నామని సీఐ దివాకర్ యాదవ్ తెలిపారు.
News February 22, 2026
విశాఖ కలెక్టరేట్‌లో రేపు పీజీఆర్ఎస్

విశాఖ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతాయని, రెవెన్యూ అధికారులతో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరవుతారని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను పూర్తి వివరాలతో సమర్పించాలని సూచించారు.


