News February 14, 2025
విశాఖ: పోలీసుల అదుపులో డ్రగ్స్ నిందితులు

ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన షేక్ ముధఫర్, మహమ్మద్ చాంద్, షేక్ అనీష్ విశాలాక్షి నగర్‌లో <<15460513>>బ్రౌన్ షుగర్ <<>>అమ్ముతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే టాస్క్ ఫోర్స్, ఆరిలోవ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ మల్లేశ్వరరావు తెలిపారు.
Similar News
News March 17, 2025
విశాఖ: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఆత్మహత్య

ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధి బాకువరపాలెంలో ఉరివేసుకుని యువకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రమేశ్ (25) మద్యానికి బానిసయ్యాడు. భార్య మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఆదివారం రాత్రి ఉరి వేసుకుని మృతి చెందినట్లు తెలిపారు. రమేశ్ భార్య ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం డెడ్‌బాడీని భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
News March 17, 2025
కైలాసగిరిపై దేశంలోనే పొడవైన గ్లాస్ బ్రిడ్జి

కైలాసగిరిపై ఏప్రిల్ నాటికి దేశంలోనే పొడవైన గ్లాస్ బ్రిడ్జి అందుబాటులోకి తీసుకొస్తామని వీఎంఆర్డీఏ చైర్ పర్సన్ ప్రణవ్ గోపాల్, ఎంసీ విశ్వనాథన్ తెలిపారు. సోమవారం విలేకరులతో మాట్లాడారు. బీచ్ రోడ్డులో హెలికాప్టర్ మ్యూజియం, సిరిపురంలో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, కమర్షియల్ కాంప్లెక్స్‌లను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని చెప్పారు. అనకాపల్లి వద్ద హెల్త్ సిటీ ఏర్పాటు చేస్తామన్నారు.
News March 17, 2025
అరిలోవ: జైలులో ఖైదీలకు ఫోన్‌లు అందించిన దంపతులు అరెస్ట్

సెంట్రల్ జైలులో ఖైదీలకు ఫోన్‌లు అందించిన కేసులో భార్యాభర్తలను అరిలోవ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఈ కారాగారంలో పని చేసిన ఫార్మాసిస్టు శ్రీనివాసరావుతో పాటు అతడి భార్య పుష్పలతను ఆదివారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై కృష్ణ తెలిపారు. జైలులో ఉన్న నాగమల్లేశ్వరావు అనే ముద్దాయికి ఫోన్లు అందించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. దంపతులు శ్రీకాకుళం జిల్లా జలుమూరు పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.