News January 26, 2025
విశాఖ పోలీసుల అదుపులో స్పా నిర్వాహకులు?

విశాఖ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో ఓ స్పా సెంటర్‌పై పోలీసుల దాడులు శనివారం రాత్రి దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఈ ఘటనలో పశ్చిమ బంగా, విశాఖకు చెందిన ముగ్గురు యువతులతో పాటు విటుడు, స్పా నిర్వాహకులను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. స్పాకు నిర్వాహకులకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. కాగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Similar News
News November 16, 2025
విశాఖ: ప్రభుత్వ కార్యాలయాలలో రేపు పీజీఆర్ఎస్

విశాఖ కలెక్టరేట్లో ఈనెల 17న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. అదేవిధంగా సీపీ, జీవీఎంసీ ప్రధాన, జోనల్ కార్యాలయాల్లో కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వినతులు స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
News November 16, 2025
కంచరపాలెంలో చెట్టుకు వేలాడుతున్న మృతదేహం

కంచరపాలెంలోని ఓ చెట్టుకు వేలాడుతున్న వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు శనివారం గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో కంచరపాలెం సీఐ రవికుమార్ సంఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. పదిరోజుల క్రితమే ఈ ఘటన జరిగి ఉండవచ్చని, మృతుని వయస్సు సుమారు 35-40 ఏళ్లు ఉంటుందని సీఐ తెలిపారు. మృతుని వివరాలు తెలియరాలేదని, దీనిని అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ చెప్పారు
News November 16, 2025
జగదాంబ జంక్షన్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి

జగదాంబ జంక్షన్‌లోని బస్‌స్టాప్ వద్ద ఓ వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న మహారాణిపేట సీఐ దివాకర్ యాదవ్ సంఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుని వివరాలపై ఆరా తీశారు. మృతుని ఒంటిపై గాయాలు లేవని.. అయితే అనారోగ్యం కారణంగా చనిపోయాడా? ఇంకా ఏమైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మృతదేహాన్ని KGH మార్చురీకి తరలించామని అతని వివరాలు తెలిస్తే తమను సంప్రదించాలని సీఐ కోరారు.


