News January 26, 2025
విశాఖ పోలీసుల అదుపులో స్పా నిర్వాహకులు?

విశాఖ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో ఓ స్పా సెంటర్‌పై పోలీసుల దాడులు శనివారం రాత్రి దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఈ ఘటనలో పశ్చిమ బంగా, విశాఖకు చెందిన ముగ్గురు యువతులతో పాటు విటుడు, స్పా నిర్వాహకులను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. స్పాకు నిర్వాహకులకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. కాగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Similar News
News February 13, 2025
ఏలూరులో వందే భారత్‌కు అదనపు హాల్ట్ కొనసాగింపు

విశాఖ – సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు (20707/08)కు ఏలూరు రైల్వే స్టేషన్‌లో అదనపు హాల్ట్ మరో ఆరు నెలలు కొనసాగుతుందని వాల్తేరు డివిజన్ డిసిఎం సందీప్ గురువారం తెలిపారు. ఏలూరు రైల్వే స్టేషన్‌లో ఒక నిమిషం పాటు రైలు ఆగనున్నట్లు తెలిపారు. ఈ హాల్ట్ ఇరువైపులా ఉంటుందన్నారు. ప్రయాణికుల విషయాన్ని గమనించాలన్నారు.
News February 13, 2025
ఉత్తరాంధ్ర టీచర్ MLC బరిలో 10 మంది

ఉత్తరాంధ్ర టీచర్ MLC స్థానానికి 10మంది పోటీలో ఉన్నట్లు ఎన్నికల అధికారి హరేంధిర ప్రసాద్ తెలిపారు. 10మంది నామినేషన్ వెయ్యగా.. ఏ ఒక్కరూ ఉపసంహరించుకోలేదన్నారు. ఈనెల 27న పోలింగ్ జరగనుండగా.. మార్చి 3న కౌంటింగ్ ఉండనుంది. 12 ఎంసీసీ బృందాలు, 11 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థులతో గురువారం ఆయన సమావేశమయ్యారు. నేర చరిత్ర లేనివారిని ఏజెంట్లుగా నియమించుకోవాలని సూచించారు.
News February 13, 2025
విశాఖ: కాలేజీ పైనుంచి దూకి విద్యార్థి సూసైడ్

విశాఖలో బుధవారం అర్ధరాత్రి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒడిశా రాష్ట్రం రాయపూర్‌కి చెందిన చంద్రవంశీ (17) బోరవాణి పాలెంలోని నారాయణ కాలేజీలో చదువుతున్నాడు. అర్ధరాత్రి కాలేజీ 5వ అంతస్థు నుంచి దూకి చంద్రవంశీ మృతి చెందాడు. మృతదేహాన్ని KGHకి తరలించారు. పీఎంపాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. CITU నాయకులు గురువారం ఉదయం ఘటనా స్థలిని పరిశీలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.