News July 27, 2024
విశాఖ: పోలీస్ సిబ్బందికి రివార్డులు అందించిన సీపీ
ఈ నెలలో ఉత్తమ సేవలు అందించిన పోలీస్ కానిస్టేబుల్ నుంచి సీఐ వరకు 81 మందికి నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ రివార్డులు అందించారు. నగరంలో శనివారం నెలవారీ క్రైమ్ రెవ్యూ నిర్వహించారు. గంజాయి రవాణా, చోరీ సొత్తు రికవరీ తదితర సంఘటనలలో ప్రతిభ కనపర్చిన వారికి ప్రతి నెలా రివార్డులు అందజేసి వారిని ప్రోత్సహిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.
Similar News
News October 7, 2024
విశాఖ: టెట్ పరీక్షకు 84 శాతం మంది హాజరు
జిల్లాలో సోమవారం నిర్వహించిన టెట్ పరీక్షకు 84.36 శాతం మంది హాజరైనట్లు డీఈవో చంద్రకళ తెలిపారు. ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తం 4610 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 3889 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. ఉదయం 5 పరీక్ష కేంద్రాల్లోనూ మధ్యాహ్నం 5 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించినట్లు వివరించారు. తాను ఒక పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేయగా ఫ్లయింగ్ స్క్వాడ్ 2 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు తెలిపారు.
News October 7, 2024
విశాఖ: ఢిల్లీలో జరిగిన సదస్సులో పాల్గొన్న హోంమంత్రి
ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షా అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు నిర్వహించిన సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం తరపున అనిత పాల్గొన్నారు. మావోయిస్టుల కట్టడి, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి, కార్యచరణ ప్రణాళికపై ప్రధానంగా చర్చ జరిగినట్లు హోం మంత్రి తెలిపారు.
News October 7, 2024
అనకాపల్లి: కలెక్టరేట్ పరిష్కార వేదికకు 232 అర్జీలు
అనకాపల్లి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ సంస్థలపై 232 అర్జీలను ప్రజలు అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ జాహ్నవి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.