News May 3, 2024

విశాఖ ప్రధాన కూడళ్ళలో గ్రీన్ రూఫ్ ఏర్పాటు

image

విశాఖలోని పలు ప్రధాన జంక్షన్లో వేసవి తాపానికి గాను గ్రీన్ రూఫ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతంలో వీటిని ఏర్పాటు చేయడంతో వాహనచోదకులకు కొంత ఉపశమనం లభిస్తోంది. ఇటీవల కాలంలో దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఇలాంటి గ్రీన్ రూఫ్‌లను ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు జీవీఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు.

Similar News

News November 6, 2024

అధికార లాంఛనాలతో మాజీ మంత్రి అంత్యక్రియలు

image

మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాల్సిందిగా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. చీడికాడ మండలం పెదగోగాడలో మాజీ మంత్రి అంతిమయాత్ర మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. రాష్ట్రం నలుమూలల నుంచి అనేకమంది ప్రముఖులు, ప్రజలు తరలివచ్చి తమ నాయకుడికి నివాళులర్పిస్తున్నారు.

News November 6, 2024

విశాఖ పోర్టుకు సముద్ర పర్యావరణ సురక్ష ట్రోఫీ

image

ప్రకృతి వైపరీత్యాల నివారణ ప్రణాళిక అమలులో అత్యుత్తమ పనితీరు కనపర్చినందుకు విశాఖ పోర్ట్ ట్రస్ట్ అథారిటీకి మంచి గుర్తింపు లభించింది. ఢిల్లీలో కోస్టుగార్డు ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో జాతీయ ఆయిల్ స్పిల్ డిజాస్టర్ కాంటిన్ జెన్సీ సమావేశంలో సముద్రి పర్యావరణ సురక్ష ట్రోఫీని అందజేశారు. ఈ విషయాన్ని విశాఖ పోర్టు కార్యదర్శి టి.వేణుగోపాల్ తెలిపారు.

News November 6, 2024

Dy.cm పవన్, లోకేశ్ ఫొటోల మార్ఫింగ్.. పోలీసుల అదుపులో విశాఖ వ్యక్తి

image

నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు క్రియేట్ చేసి రాష్ట్ర మంత్రులు పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి అప్రతిష్ఠ పాలు చేస్తున్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తను దువ్వాడ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. విశాఖ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ఎస్.రతన్ కాంత్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. 88వ వార్డు యాదవ జగ్గరాజుపేటకు చెందిన బి.వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.