News August 27, 2024
విశాఖ: ప్రమాదానికి ముందే సంకేతాలు..!
అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో జరిగిన భారీ పేలుడుకు సంబంధించి సిబ్బందికి గంటన్నర ముందే ప్రమాద సంకేతాలు అందినట్లు తెలిసింది. బల్క్ డ్రగ్ తయారీలో ఉపయోగించే ఎంటీబీఈ రసాయనం లీక్ అవుతున్నా సిబ్బంది, కంపెనీ అధికారులు స్పందించకపోవడంతో ప్రమాదం జరిగినట్లు తనిఖీ అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. తక్షణం స్పందించి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదని వారు నివేదికలో పేర్కొన్నారు.
Similar News
News September 11, 2024
పెదమానాపురం హైవేపై లారీ బోల్తా
దత్తిరాజేరు మండలం పెదమానాపురం హైవేపై ఈరోజు తెల్లవారుజామున లారీ బోల్తా పడింది. వివరాల్లోకి వెళ్తే ఛత్తీస్‌గడ్ నుంచి కంటకాపల్లి వైపు బొగ్గుతో వెళ్తున్న లారీ పెదమానాపురం ఆర్‌సీఎం చర్చి దగ్గర బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్‌కి స్వల్ప గాయాలయ్యాయి. ఈ రోడ్డుపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని.. నివారణ చర్యలు చేపట్టాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.
News September 11, 2024
కౌలు రైతుల రుణాలను ముమ్మరం చేయాలి: కలెక్టర్
విజయనగరం జిల్లాలో కౌలు రైతులకు రుణాలు అందించే కార్యక్రమాన్ని బ్యాంకులు మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ అంబేడ్కర్ బ్యాంకర్లను కోరారు. కౌలు రైతులకు రుణాలు అందించే కార్యక్రమంపై డీసీసీ సమావేశంలో కలెక్టర్ సమీక్షించారు. 2,333 మందికి కౌలు రుణాల కోసం బ్యాంకులకు దరఖాస్తులు పంపించామని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి రామారావు వివరించారు.
News September 10, 2024
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
విజయనగరం పట్టణం అలకానంద కాలనీలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు చేశారు. అక్కడ కొన్నాళ్లుగా ఒక మహిళ వ్యభిచార గృహం నిర్వహిస్తుందనే సమాచారంతో మంగళవారం సాయంత్రం దాడులు చేసి, ఇద్దరు విటులు, ఒక బాధితురాలితో పాటు వ్యభిచార గృహం నిర్వహిస్తున్న మహిళను వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యభిచార గృహం నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.