News February 26, 2026
విశాఖ: ఫిజియోథెరపీ విద్యార్థిని ఆత్మహత్య

ఫిజియోథెరపీ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన గాజువాక ఉడా కాలనీలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పైడా రజిని(21) అనే విద్యార్థిని ఫ్యాన్‌కు ఉరివేసికుని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ లెటర్‌లో వెల్లడించింది. న్యూపోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మధురవాడలోని ఓ కళాశాలలో ఈ విద్యార్థిని చదువుతోంది.
Similar News
News April 20, 2026
బెట్టింగ్.. ప్రకాశం జిల్లా యువకుడి అరెస్ట్

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పోలీసులు <<19692230>>బెట్టింగ్ ముఠా<<>>ను అరెస్ట్ చేశారు. ఉంగుటూరు మండలం గొల్లగూడేనికి చెందిన నరసింహాచార్యులును విచారించారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి అడ్డగా బెట్టింగ్ నడుపుతున్నట్లు తేలింది. ప్రకాశం జిల్లా ముండ్లమూరు(M) ఉల్లగల్లుకు చెందిన పర్వతనేని వేణుతో పాటు ఇతర జిల్లాలకు చెందిన గజ్జల రవీంద్ర రెడ్డి, పల్లెపాగ రవి, తులబంతుల తాండవ కృష్ణను అరెస్ట్ చేశారు.
News April 20, 2026
KMR: నేటి నుంచి ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలు

కామారెడ్డి జిల్లాలో నేటి నుంచి 27 వరకు 14 పరీక్షా కేంద్రాల్లో ఓపెన్ పది, ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో రాజు తెలిపారు. ఉదయం 9 నుంచి 12 గం. మధ్యాహ్నం 2.30 నుంచి 5 గం.ల వరకు జరుగుతాయన్నారు. అభ్యర్థులు పరీక్షలు జరిగే సమయంలో హాల్ టికెట్లతో పాటు ఒరిజినల్ ఆధార్ కార్డులు తమ వెంట తెచ్చుకోవాలని ఆయన సూచించారు. అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రాలకు ముందే చేరుకోవాలని తెలిపారు.
News April 20, 2026
అమానుషం.. కన్నపిల్లల్నే కాల్చి చంపాడు!

అమెరికాలోని లూసియానా కాల్పుల <<19693285>>కేసులో<<>> హృదయవిదారక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు కాల్చి చంపిన ఎనిమిది మంది పిల్లల్లో ఏడుగురు కన్నబిడ్డలే ఉన్నారు. మృతుల్లో ఏడాది చిన్నారి కూడా ఉంది. భార్య, మరో మహిళపైనా నిందితుడు కాల్పులు జరపగా వారి పరిస్థితి విషమంగా ఉంది. 2024 జనవరి తర్వాత USలో ఈ స్థాయిలో కాల్పులు జరగడం ఇదే తొలిసారి. పోలీసుల కాల్పుల్లో నిందితుడు చనిపోగా ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.


