News March 6, 2025
విశాఖ: ఫోన్ కోసం కుమార్తెతో గొడవ.. తండ్రి సూసైడ్

విశాఖలో పురుగు మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. ఆరిలోవ ఎస్‌ఐ వై.కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఆరిలోవ దుర్గా బజారుకు చెందిన బి.మణికంఠకు పదో తరగతి చదువుతున్న కుమార్తె ఉంది. ఫోన్ విషయంలో తండ్రి, కూతురి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన మణికంఠ ఫిబ్రవరి 24న పురుగుల మందు తాగాడు. ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Similar News
News March 7, 2025
విశాఖ: గీత కార్మికులకు 14 మద్యం దుకాణాలు కేటాయింపు

విశాఖలో గీత కార్మికులకు కేటాయించిన మద్యం దుకాణాలకు గురువారం లాటరీ నిర్వహించారు. ఉడా చిల్డ్రన్ ఏరినాలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఆధ్వర్యంలో ఈ లాటరీ నిర్వహించారు. ఇందులో 14 మందికి మద్యం దుకాణాలను కేటాయించారు. వారిలో జీవీఎంసీ లిమిట్స్‌లో 11 మందికి, భీమిలి పరిధిలో ఒకరికి, పద్మనాభం పరిధిలో ఒకరికి, ఆనందపురం పరిధిలో ఒకరికి కేటాయించారు. జిల్లాలో 14 మద్యం దుకాణాలకు గాను 316 దరఖాస్తులు వచ్చాయి.
News March 7, 2025
విశాఖ: 8న జాతీయ లోక్ అదాలత్

విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మార్చి 8న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తామని ఆ సంస్థ కార్యదర్శి వెంకటశేషమ్మ తెలిపారు. జిల్లాలోని అన్ని కోర్టుల్లో లోక్ అదాలత్ జరుగుతుందన్నారు. పెండింగ్‌లో ఉన్న సివిల్, క్రిమినల్ కేసులు, బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాల నష్టపరిహారాల కేసులు, ప్రీ-లిటిగేషన్ కేసులను పరిష్కరించుకోవచ్చని సూచించారు.
News March 7, 2025
విశాఖలో టుడే టాప్ న్యూస్

➤ విశాఖలో ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ చేసిన నేతలు ➤ ఏప్రిల్ 10వ తేదీన సింహాద్రి అప్పన్న చందనోత్సవం ➤ హనుమంతువాకలో యాక్సిడెంట్ ఒకరు మృతి ➤ మల్కాపురం పరిధిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం ➤ ఏయూ వీసీతో నన్నయ్య యునివర్సిటీ వీసీ భేటీ ➤ విశాఖలో ఈ నెల 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ ➤ ఏయూను సందర్శించిన ఎన్.హెచ్.ఆర్.సి సభ్యురాలు