News March 25, 2025
విశాఖ: ఫ్రీ పార్కింగ్.. ఏప్రిల్ 1 నుంచి అమలు

విశాఖలోని వాణిజ్య సముదాయలు, మాల్స్, మల్టీప్లెక్సుల్లో అడ్డగోలుగా పార్కింగ్ ఫీజును వసూలు చేయరాదని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు కానున్నాయి. వాణిజ్య సముదయాలలో వస్తువులు కొనుగోలు చేసి బిల్లులు చూపిస్తే 30 నిముషాలు, మల్టిఫ్లెక్స్‌లో సినిమా టికెట్ చూపిస్తే గంటసేపు పార్కింగ్ చేసుకోవచ్చుని ఉత్తర్వులలో పేర్కోంది.
Similar News
News November 24, 2025
విశాఖ: మరింత సులువుగా ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు!

ట్రాఫిక్ చలాన్లను సులువుగా చెల్లించేందుకు విశాఖ పోలీసులు కొత్త ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చారు. గతంలో mPARIVAHAN appలో చలాన్లు చెల్లించేవారు. ప్రస్తుతం PhonePay యాప్‌లోనూ eChallan & icon enable చేశారు. యాప్‌లో eChallan ఐకాన్ సెలెక్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసి.. వాహన నెంబర్‌ను ఎంటర్ చేస్తే వాహనంపై ఉన్న చలానాలన్నీ కనిపిస్తాయి. అక్కడ చెల్లింపులు పూర్తి చేయొచ్చు.
News November 24, 2025
విశాఖలో హోంగార్డు అనుమానాస్పద మృతి.!

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న హోంగార్డు బి.కృష్ణారావు (56) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆదివారం కూరగాయల కోసం బయటకు వెళ్లిన ఆయన కాసేపటికే విశాఖలోని 104 ఏరియా రైలు పట్టాలపై విగతజీవిగా కనిపించారు. ఘటనా స్థలాన్ని రైల్వే పోలీసులు పరిశీలించారు. ఇది ఆత్మహత్యా లేక ప్రమాదమా అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు.
News November 24, 2025
విశాఖ తీరంలో విషాదం.. మరో మృతదేహం లభ్యం

విశాఖ లైట్ హౌస్ బీచ్‌లో గల్లంతైన ఇద్దరు విద్యార్థుల ఘటన విషాదాంతమైంది. ఆదివారం తేజేశ్ మృతదేహం లభ్యం కాగా, సోమవారం ఉదయం ఆదిత్య మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చిందని త్రీ టౌన్ సీఐ పైడయ్య తెలిపారు. సముద్ర స్నానానికి దిగి అలల ధాటికి వీరిద్దరూ ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


