News October 21, 2024

విశాఖ: బంగాళాఖాతంలో ‘దానా’ తుఫాను

image

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఇది తుఫానుగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం సోమవారం వెల్లడించింది. వాయవ్య దిశగా పయనిస్తుందని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా, ఆపై తుఫానుగా మారనుందని పేర్కొన్నారు. ఈ తుఫానుకు ‘దానా’ అని నామకరణం చేశారు. ఉత్తర అండమాన్ సముద్రాన్ని ఆనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపారు.

Similar News

News October 29, 2025

జీవీఎంసీ సిటీ ఆపరేషన్ సెంటర్‌ను సందర్శించిన కలెక్టర్

image

జీవీఎంసీ సిటీ ఆపరేషన్ సెంటర్‌ను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సందర్శించారు. సిటీ ఆపరేషన్ సెంటర్ ద్వారా తుఫాను కారణంగా తీసుకుంటున్న జాగ్రత్తలను కమిషనర్ కేతన్ గార్గ్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇస్తున్నామని వివరించారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు.

News October 28, 2025

రేపు కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సెలవు

image

ఆంధ్ర విశ్వవిద్యాలయానికి బుధవారం కూడా సెలవు ప్రకటిస్తూ ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులకు 2 రోజులుగా తరగతులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. తుఫాను నేపథ్యంలో ఉద్యోగులకు, సిబ్బందికి సైతం మంగళవారం సెలవు ప్రకటించారు. విశాఖ జిల్లాలో పాఠశాలలకు, కళాశాలలకు రేపు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏయూ అధికారులు కూడా సెలవు ప్రకటించారు.

News October 28, 2025

మరింత అప్ర‌మ‌త్తంగా ఉందాం: ప్రత్యేక అధికారి

image

మొంథా తుపాను మంగళవారం రాత్రి 10 నుంచి సుమారు 12 గంటల మధ్య తీరం దాటే అవకాశం ఉందని ప్రత్యేక అధికారి అజయ్ జైన్ వెల్లడించారు. మంగళవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు చేపట్టే ముందస్తు జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఎంపీ శ్రీభరత్, తదితరులు పాల్గొన్నారు.