News May 29, 2024

విశాఖ: బాలికపై అత్యాచారం.. 20ఏళ్ల జైలు శిక్ష

image

విశాఖలో 2017లో సంచలనం రేపిన కిడ్నాప్, రేప్ కేసులో పోక్సో కోర్టు న్యాయమూర్తి ఆనంది మంగళవారం సంచలన తీర్పు వెల్లడించారు. 5వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక‌ను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన కేసులో నిందితుడు గణేశ్‌కి 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు. బాధితురాలికి రూ.4 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చారు. న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Similar News

News January 22, 2025

విశాఖ: రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి

image

అగనంపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు భార్యాభర్తలని పోలీసులు తెలిపారు. ఫార్మాసిటీలో విధులు నిర్వహిస్తున్న మన్మధరావు తన భార్య అరుణ్ కుమారీతో కలిసి అగనంపూడి వద్ద డొంకాడ గ్రామంలో అద్దెకు ఉంటున్నట్లు సీఐ వివరాలు వెల్లడించారు. బ్యాంకు పనినిమిత్తం బైక్‌పై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారని సీఐ తెలిపారు.

News January 22, 2025

అల్లూరి: బడి కోసం ఊరంతా ఏకమైంది..!

image

చింతపల్లి మండలం బలపం పంచాయతీ వీరవరంలో పాఠశాల భవనం నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు. గ్రామంలో పాఠశాల భవనం లేక బడి ఈడు పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రామస్థులంతా ఏకమై శ్రమదానంతో రేకుల షెడ్డు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. విద్యాశాఖా మంత్రి లోకేశ్, అధికారులు వెంటనే స్పందించి గ్రామంలో పాఠశాల భవనం నిర్మించాలని కోరారు.

News January 22, 2025

అగనంపూడి వద్ద యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

image

అగనంపూడి టోల్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం గాజువాక నుంచి అగనంపూడి వైపు బైక్‌పై వెళ్తున్న ఇద్దరు లారీ వెనుక చక్రాల కింద పడి స్పాట్‌లోనే మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఒక మహిళ, మరో పురుషుడు ఉన్నారు. మృతి చెందిన మహిళ వద్ద ఉన్న ఆధార్ కార్డు, బ్యాంకు బుక్ ప్రకారం పాత గాజువాకకు చెందిన గొర్లె అరుణ్ కుమారిగా పోలీసులు గుర్తించారు. యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది.