News October 19, 2024
విశాఖ: బాలికపై లైంగిక దాడి కేసులో వ్యక్తికి జైలు శిక్ష

బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి జి.ఆనంద్‌ని శుక్రవారం తీర్పు ఇచ్చారు. నిందితుడు ఏ.పోచన్న కూర్మన్నపాలెం పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసేవాడు. పాఠశాలలో చదువుతున్న బాలిక (9) 2023 ఏప్రిల్ 1న వాష్ రూమ్ వద్దకు రావడంతో నిందితుడు లైంగికదాడికి ప్రయత్నించాడు. దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News November 15, 2025
వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఎండీతో మంత్రి లోకేశ్ భేటీ

మంత్రి నారా లోకేశ్, వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఎండి జెరేమి జుర్గెన్స్‌తో భేటీలో గ్రీన్ ఎనర్జీ, సైబర్‌సెక్యూరిటీ రంగాల్లో సహకారం కోరారు. ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మార్చేందుకు 115 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యాన్ని వెల్లడించారు. గ్రీన్ హైడ్రోజన్ జాతీయ లక్ష్యంలో 30% ఏపీలోనే సాధించాలని తెలిపారు.
News November 15, 2025
ఇఫ్కో ఛైర్మన్‌తో సీఎం చర్చలు

విశాఖలో జరుగుతున్న సమ్మిట్‌లో ఇఫ్కో ఛైర్మన్ దిలీప్ ననూభాయ్ సంఘానీతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. గ్రీన్ అమ్మోనియా, హైడ్రోజన్ ఆధారిత ఫెర్టిలైజర్ ప్లాంట్ల ఏర్పాటు, రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించే అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. బయో-ఫర్టిలైజర్, బయో-స్టిమ్యులెంట్ యూనిట్ల స్థాపనకు ఉన్న అవకాశాల పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు.
News November 15, 2025
మార్గశిర ఉత్సవాలకు దేవదాయ శాఖ మంత్రికి ఆహ్వానం

బురుజుపేటలో కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవాలకు దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ఆలయ ఈవో శోభారాణి ఆహ్వానించారు. విజయవాడలో శనివారం ఆయనను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. లక్షలాదిగా వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకొని వసతి, రక్షణ, పారిశుద్ధ్యం, క్యూలైన్లు, పార్కింగ్, దర్శనం ఏర్పాట్లు, తాగునీరు, వైద్య సౌకర్యాలు, తదితర అంశాల్లో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రికి ఈవో వివరించారు.


