News April 10, 2024
విశాఖ బీచ్ రోడ్డులో ఇద్దరు యువకులు మృతి..!

విశాఖలోని తొట్లకొండ బీచ్ రోడ్డులో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వెళుతూ.. రెండు బైక్లు ఎదురు ఎదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా.. గాయాలైన మరో ఇద్దరిని ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. ఘటనకు సంబంధిచి మరన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 18, 2025
రుషికొండలో తిరుమల విక్రయాలు పునఃప్రారంభం

రుషికొండ శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత వేంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డూ విక్రయాలు శనివారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఇటీవల ఒంటిమిట్ట సీతారామ కల్యాణోత్సవం కోసం లడ్డూలు తరలించడంతో అమ్మకాలు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పుడు భక్తులకోసం ఆలయంలోనే కౌంటర్ ద్వారా లడ్డూల విక్రయాలు ఏప్రిల్ 19వ తేదీ నుంచి మళ్లీ ప్రారంభమవుతాయని ఆలయ ఏఈఓ జగన్మోహనాచార్యులు శుక్రవారం తెలిపారు.
News April 18, 2025
మంగళగిరిలో ప్రజాదర్బార్ నిర్వహించిన హోం మంత్రి

హోంమంత్రి వంగలపూడి అనిత మంగళగిరి టీడీపీ ఆఫీసులో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్లో ప్రజలు తమ సమస్యలను చెప్పుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలు తెలుపుకున్నారు. భూసమస్యలు, పిల్లల విద్యకు సంబంధించి, చెరువుకు సంబంధించిన సమస్యలను అర్జీదారులు హోంమంత్రి వద్ద మొరపెట్టుకున్నారు. ఈ సమస్యలన్నిటినీ వెంటనే పరిష్కరించాలని హోం మంత్రి అధికారులను ఆదేశించారు.
News April 18, 2025
విశాఖ: ‘చేపల వేట చేస్తే ప్రభుత్వ రాయితీల నిలుపుదల’

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వరకు సముద్ర జలాలో చేపల వేట నిషేధమని విశాఖ మత్స్యశాఖ డైరెక్టర్ చంద్రశేఖర్ గురువారం తెలిపారు. సముద్ర జలాలలో చేప, రొయ్యల జాతులు సంతానోత్పత్తి కోసం వేట నిషేధం చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించి చేపల వేట చేస్తే బోట్లను, బోట్లలోని మత్స్య సంపదను స్వాధీనం చేసుకొని ప్రభుత్వ రాయితీలు నిలుపుదల చేస్తామని హెచ్చరించారు.