News April 11, 2024
విశాఖ బీచ్ రోడ్డులో ప్రమాదం.. మృతుల వివరాలు

విశాఖ తొట్లకొండ బీచ్ రోడ్డులో జరిగిన <<13024927>>రోడ్డు ప్రమాదంలో<<>> మృతిచెందిన వారి వివరాలు వెల్లడయ్యాయి. చింతపల్లి వీరభద్ర అనే యువకుడు భీమిలి నుంచి బైక్‌పై విశాఖ వెళ్తున్నాడు. అదే సమయంలో రుషికొండకు చెందిన దౌలపల్లి చిన అప్పలరాజు రుషికొండ నుంచి ఉప్పాడ వైపు బైకుపై వస్తున్నాడు. వంతెన పాడైన కారణంగా వన్ వే దారిలో ఎదురెదురుగా వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం వాటిల్లింది. ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.
Similar News
News January 13, 2026
కేజీహెచ్‌లో నాలుగు నెలల్లో 100 క్యాన్సర్ ఆపరేషన్లు

కేజీహెచ్‌లో వివిధ రకాల క్యాన్సర్లకు అత్యాధునిక ట్రీట్మెంట్ జరుగుతోందని విభాగాధిపతి ఎమ్మెస్ శ్రీనివాస్ తెలిపారు. 4 నెలల క్రితం ఆరోగ్య శాఖ మంత్రి కేజీహెచ్‌లో సిటీ ఇమ్యులేటర్, ఎక్సలేటర్ క్యాన్సర్ గడ్డలు కనుగొనే పరికరాన్ని ప్రారంభించారు. ఈ పరికరంతో ఏడు జిల్లాల నుంచి వస్తున్న రోగులు, ఒరిస్సా నుంచి వచ్చిన దాదాపు 100 మందికి ఆపరేషన్లు చేశామని కేజీహెచ్ సూపరింటెండెంట్ వాణీ పేర్కొన్నారు.

విశాఖలో వాహనదారులకు అలర్ట్

విశాఖలో వాయు కాలుష్యాన్ని తగ్గించే సదుద్దేశంతో ‘నో పొల్యూషన్ సర్టిఫికేట్ – నో ఫ్యూయల్’పై టైకూన్ జంక్షన్ నుంచి మద్దిలపాలెం వరకు ప్రత్యేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ నెలాఖరు వరకు వాహనదారులకు దీనిపై అవగాహన కల్పిస్తారు. ఆ తర్వాత పెట్రోల్ బంకుల్లో ఇబ్బందులు రాకుండా.. జరిమానాలు పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకోవాలని త్రీ టౌన్ సీఐ అమ్మి నాయుడు తెలిపారు.