News May 12, 2024
విశాఖ బీచ్ రోడ్‌లో భారీ నగదు పట్టివేత..!

విశాఖ నగరంలో ఎన్నికల నియమ నిబంధనలకు విరుద్ధంగా భారీగా తరలిస్తున్న నగదు పట్టివేత కలకలం రేపింది. సుమారు రూ.కోటిన్నర నగదును తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ ఆకస్మిక తనిఖీలతో ఈ నగదు వ్యవహారం బయటపడింది. విశాఖ ఆర్కే బీచ్‌కు సమీపంలో పాండురంగపురంలోని కారులో తరలిస్తున్న రూ.కోటిన్నర నగదు స్వాధీనం చేసుకున్నారు. సీ-విజిల్‌లో ఇచ్చిన ఫిర్యాదుతో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.
Similar News
News February 10, 2025
విశాఖలో పోలీస్ అధికారులతో సమీక్ష చేసిన డీజీపీ

విశాఖలో పోలీసుల పనితీరు చాలా బాగుందని క్రైమ్ రేట్ పెరగకూడదని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. కమిషనర్ కార్యాలయంలో అధికారులతో ఆదివారం సమావేశం నిర్వహించి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సమస్యలు విని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కమిషనర్‌తో పాటు డీసీపీలు పాల్గొన్నారు.
News February 9, 2025
విశాఖ: సముద్రంలో మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి

విశాఖకు చెందిన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వాడరాంబిల్లి సముద్ర తీరంలో ఆదివారం మృతిచెందారు. మృతులు కంచరపాలేనికి చెందిన మొక్క సూర్యతేజ, దువ్వాడకు చెందిన మొక్క పవన్‌గా గుర్తించారు. రాంబిల్లి బీచ్‌లో స్నానం చేయడానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో అలల తాకిడికి సముద్రంలో మునిగి చనిపోయినట్లు పోలీసు అధికారులు ధ్రువీకరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 9, 2025
విశాఖ: మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియకు బ్రేక్

విశాఖ జిల్లాలో గీత కులాలకు కేటాయించిన 14 మద్యం షాపులు లాటరీ పద్ధతికి బ్రేక్ పడింది. సోమవారం లాటరీ పద్ధతిలో షాపులు కేటాయించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తర్వాత తేదీని ఖరారు చేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.