News April 12, 2024
విశాఖ: ‘బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం ఉండదు’

బీజేపీ అధికారంలోకి వస్తే అంబేద్కర్ రాజ్యాంగం ఉండదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. గురువారం సీపీఐ నగర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కమ్యూనిస్టు పార్టీలకు సీట్లు ఓట్లు రాకపోయినా ప్రజల తరపున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణమూర్తి, సీపీఐ అభ్యర్థి అత్తిలి విమల, పార్టీ నేత పైడిరాజు పాల్గొన్నారు.
Similar News
News March 25, 2025
జీవీఎంసీలో ఏ కార్పొరేటర్‌పైనా ఒత్తిడి తేలేదు: MLC పిడుగు

జీవీఎంసీ మేయర్ పీఠం కోసం ఏకార్పొరేటర్ పైనా ఒత్తిడి చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదని జనసేన MLC పిడుగు హరిప్రసాద్ అన్నారు. సోమవారం గాజువాకలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని కార్పొరేటర్లు గ్రహించారని దీంతో వారంతా మద్దతు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. అధికార బలంతో గతంలో జీవీఎంసీలో ఎన్నో అవకతవకలు జరిగాయని ఆరోపించిన ఆయన.. వాటిని వెలికి తీయాల్సిన అవసరం ఉందన్నారు.
News March 25, 2025
విశాఖలో 15 మందిపై పీడీ యాక్ట్..!

విశాఖ సిటీలో రౌడీ షీటర్ల ఆగడాలు నివారించేందుకు విశాఖ సీపీ కఠిన చర్యలు చేపడుతున్నారు. అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారి వివరాలు సేకరిస్తూనే పలువురుపై పీడీ యాక్ట్ పెడుతున్నారు. తాజాగా సీతంపేట, కొబ్బరితోట ప్రాంతాలకు చెందిన వై.కుమార్, వై.ఎర్రన్నలపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఇప్పటికే 13 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేయగా.. వీరిద్దరితో ఆ సంఖ్య 15కు చేరింది.
News March 25, 2025
విశాఖ రైతు బజార్‌లో నేటి కూరగాయల ధరలు

విశాఖ రైతు బజార్‌లలో మంగళవారం నాటి కూరగాయల ధరలు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు ఈ విధంగా నిర్ణయించారు. ఉల్లిపాయలు రూ.23, బంగాళ రూ.15, టమాటలు రూ.15, బెండకాయలు రూ.30, వంకాయలు రూ.27/32/40,కాకరకాయలు రూ.38, ఆనపకాయ రూ.14, బీరకాయలు రూ.42, క్యాబేజి రూ.12, కాలి ఫ్లవర్ రూ.20, దొండకాయలు రూ.30,బీట్ రూట్ రూ.20,పొటల్స్ రూ. 46,మునగకాడలు రూ.28, క్యారట్ రూ.20,కీరా దోసకాయ రూ.22,మామిడి కాయలు రూ.40గా నిర్ణయించారు.