News July 17, 2024
విశాఖ: బొకారో ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

ధన్ బాద్-అలెప్పి బొకారో ఎక్స్‌ప్రెస్‌కు మంగళవారం పెద్ద ప్రమాదం తప్పింది. ఏ2 సెకండ్ ఏసీ భోగికి స్ప్రింగ్ విరిగిపోయింది. రైలు విశాఖ స్టేషన్‌కు చేరుకునే సమయంలో జరగడంతో ఆవరణలో ఉన్న రోలింగ్ సిబ్బంది దానిని గుర్తించి సమాచారాన్ని అధికారులకు తెలియజేశారు. ప్రయాణికులను ఖాళీ చేయించి రైలు నుంచి బోగిని తొలగించారు. వేరొక బోగిని దానికి అమర్చారు. గంటన్నర పాటు రైలు స్టేషన్‌లో నిలిచిపోయింది.
Similar News
News February 25, 2026
విశాఖ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు

నగరంలో గల జిల్లా కోర్టులో ఆర్డీఎక్స్ బాంబు పెట్టినట్లు అజ్ఞాత వ్యక్తి ఈ మెయిల్ పంపాడు. సిబ్బంది వెంటనే స్పందించి నగర పోలీస్ కమిషనర్‌కు సమాచారం అందించారు. వెంటనే డాగ్ స్క్వాడ్ సిబ్బంది కోర్టుకు చేరుకున్నారు. సుమారు రెండు గంటల పాటు కోర్టు ఆవరణం మొత్తం జల్లెడ పట్టారు. ఎక్కడా ఎటువంటి బాంబు లేదని వారు నిర్ధారించారు.
News February 25, 2026
కంబాలకొడం అభివృద్ధి కి బృహత్ ప్రణాళిక

కంబాలకొండలో పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటక అభివృద్ధికి బృహత్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు VMRDA మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్ తెలిపారు. ఈఎస్ జెడ్ పరిధిలో 30.51 చ.కి.మీ. విస్తీర్ణానికి ముసాయిదా జోనల్ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు. రహదారుల అనుసంధానం, భవిష్యత్ రహదారి మార్గాలు స్పష్టంగా చేర్చాలని సూచించారు. పర్యావరణహితంగా పర్యాటక కార్యకలాపాలు రూపకల్పన చేయాలని అటవీ అధికారులు పేర్కొన్నారు.
News February 25, 2026
విశాఖ:32 హోంగార్డు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

విశాఖ కమిషనరేట్ పరిధిలో 32 హోంగార్డ్ పోస్టులకు మంగళవారం విశాఖ సీపీ శంక బ్రత బాగ్చి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 4 వరకు అప్లికేషన్లను విశాఖ సీపీ కార్యాలయంలో ఇన్‌వర్డ్ సెక్షన్లలో తీసుకుంటారన్నారు. వివిధ పోస్టులకు పది, ఐటీఐ, హోటల్ మేనేజ్మెంట్, బీటెక్ చదివిన వారిని అర్హులుగా తెలిపారు. 21 నుంచి 50 సంవత్సరాల లోపు పురుషులు, మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.


