News August 21, 2024

విశాఖ: బొత్సాకు దక్కనున్న క్యాబినెట్ హోదా..!

image

సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓటమి చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనకు శాసనమండలలో విపక్ష హోదా ఇవ్వాలని వైసీపీ నిర్ణయించింది. ప్రస్తుత ప్రతిపక్ష నేతగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి, అధినేత జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. గతంలో ఎంపీ, ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బొత్సాకు మూడు సభలో ప్రాతినిత్యం వహించే అవకాశం దక్కింది.

Similar News

News January 21, 2025

విశాఖ డీసీపీగా కృష్ణకాంత్ పాటిల్

image

విశాఖ డీసీపీగా కృష్ణకాంత్ పాటిల్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సోమవారం  ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర మొత్తం మీద 27 మంది ఐపీఎస్‌లను బదిలీ చేశారు. అల్లూరి సీతారామరాజు అదనపు ఎస్పీగా ధీరజ్, అల్లూరి సీతారామరాజు ఆపరేషన్ అదనపు ఎస్పీగా జగదీశ్‌ను నియమించింది. ఇటీవల కాలంలో అధిక సంఖ్యలో ఐపీఎస్‌లను బదిలీ చేయడం గమనార్హం.

News January 21, 2025

జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్‌కు బదిలీ

image

జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను సీడీఎంఏకు బదిలీ చేశారు. 2024 సెప్టెంబర్‌లో జీవీఎంసీ కమిషనర్‌గా ఈయన బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఛార్జ్ తీసుకున్న కేవలం ఐదు నెలలలోపే ట్రాన్స్ ఫర్ అయ్యారు. ఈయన స్థానంలో ఇంకా ఎవరినీ కేటాయించలేదు. 

News January 20, 2025

పాడేరు ఘాట్‌లో తప్పిన పెను ప్రమాదం

image

పాడేరు ఘాట్ రోడ్ మార్గంలో సోమవారం సాయంత్రం ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. పాడేరు నుంచి విశాఖకు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఏసుప్రభు విగ్రహం మలుపు వద్ద రైలింగ్ ఢీ కొట్టి నిలిచిపోయింది. రైలింగ్ లేకపోతే పెద్ద లోయలో బస్సు పడేదని ప్రయాణికులు భయాందోళన చెందారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. కొంతసేపు బస్సు నిలిచింది. మలుపులో స్టీరింగ్ పట్టేయడంతో నేరుగా రైలింగ్‌ను ఢీకొట్టింది.