News February 14, 2025

విశాఖ: భర్త వేధింపులకు నవ వధువు ఆత్మహత్య 

image

గోపాలపట్నంలో నవవధువు ఆత్మహత్య చేసుకుంది. నాగేంద్రబాబు, వసంత 11 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. పోర్న్‌ వీడియోలకు బానిసైన నాగేంద్ర భార్య వసంతను అదేవిధంగా చేయాలని ఒత్తిడి చేసేవాడు. దీంతో మనస్తాపానికి గురైన వసంత శుక్రవారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది. గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకుని నాగేంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని KGHకి తరలించారు.

Similar News

News March 23, 2025

కశింకోటలో యాక్సిడెంట్.. UPDATE

image

కశింకోట మండలం త్రిపురవానిపాలెం జంక్షన్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందిన విషయం తెలిసిందే. అనకాపల్లి నుంచి ఎలమంచిలి వైపు వెళుతున్న లారీ డ్రైవర్ ఎటువంటి సిగ్నల్ ఇవ్వకుండా అవతలి రోడ్డుకు వెళ్లడానికి లారీని మలుపు తిప్పాడు. అదే మార్గంలో వస్తున్న మరో లారీ వెనుక నుంచి ఢీకొంది. దీంతో వెనక లారీ డ్రైవర్ షేక్ మస్తాన్ వల్లి అక్కడికక్కడే మృతి చెందినట్లు సీఐ స్వామి నాయుడు తెలిపారు

News March 23, 2025

విశాఖ: మర్డర్ మిస్టరీని ఛేదించిన పోలీసులు

image

విశాఖలో 2021లో హత్యకు గురైన జి.శ్రీను కేసును రీ ఓపెన్ చేసిన పోలీసులు <<15852353>>మర్డర్ మిస్టరీ<<>>ని ఛేదించారు. జీ.శ్రీను తమ్ముడు తోటయ్య దొంగలించిన ఫోన్‌ను లాలం గణేశ్‌కు అమ్మాడు. దీనిని గణేశ్ తమ్ముడు వాడగా ట్రాక్ చేసిన పోలీసులు తోటయ్యను అరెస్ట్ చేశారు. బెయిల్ కోసం రూ.10,000 ఖర్చు అయిందని శ్రీను గణేశ్‌ను డబ్బులు అడిగే వాడు. దీంతో శ్రీను-గణేశ్‌ మధ్య వాగ్వాదం జరగ్గా.. అది హత్యకు దారి తీసినట్లు దర్యాప్తులో తేలింది.

News March 23, 2025

రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పునరుద్ధరణ

image

రుషికొండ బీచ్ తన బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్‌ను తిరిగి పొందింది. రుషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్‌పై విధించిన తాత్కాలిక సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు ఆ సంస్థ అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా బ్లూ ఫ్లాగ్ ఇండియా జాతీయ ఆపరేటర్ డాక్టర్ శ్రీజిత్ కురూప్, బ్లూ ఫ్లాగ్ ఇండియా జ్యూరీ సభ్యుడు అజయ్ సక్సేనా విశాఖ కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌కుఇందుకు సంబంధించిన గుర్తింపు పత్రాన్ని శనివారం అందజేశారు.

error: Content is protected !!