News August 31, 2024
విశాఖ: భారీ వర్షాలపై హోంమంత్రి సమీక్ష

భారీ వర్షాలపై విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అర్ధరాత్రి విశాఖ గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా చూడాలని కలెక్టర్లకు సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
Similar News
News October 24, 2025
ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన విశాఖ కలెక్టర్

చినగదిలిలో ఈవీఎం గోదాములను కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తనిఖీ చేశారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఉదయం గోదాములను సందర్శించిన ఆయన అక్కడ పరిస్థితులను గమనించారు. సీసీ కెమెరాల పనితీరును, ప్రధాన ద్వారానికి ఉన్న సీళ్లను పరిశీలించారు. భద్రతా ప్రమాణాలపై అక్కడ అధికారులకు, భద్రతా సిబ్బందికి పలు సూచనలు చేశారు.
News October 24, 2025
‘ది డెక్’ భవనంలో జార్జియా యూనివర్సిటీ అద్దె ఒప్పందం రద్దు

సిరిపురంలోని ‘ది డెక్’ భవనంలో జార్జియా యూనివర్సిటీ అద్దె ఒప్పందాన్ని వీఎంఆర్డీఏ రద్దు చేసింది. నిర్దిష్ట సమయంలో డిపాజిట్ చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒప్పందం కుదిరిన 15 రోజుల్లోపు అడ్వాన్స్ డిపాజిట్ చెల్లించాలి. మూడు నెలలు గడిచినా డిపాజిట్ చెల్లించకపోవడంతో ఒప్పందాన్ని రద్దు చేశారు. దీంతో మూడో ఫ్లోర్ ఖాళీగా ఉంది. దీనికోసం మరోసారి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.
News October 24, 2025
‘కేజీహెచ్లో 108 నర్సింగ్ పోస్టులు భర్తీ కావాలి’

కేజీహెచ్లో 108 నర్సింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వెంటనే భర్తీ చేయాలని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు సూపరింటెండెంట్ ఐ.వాణిని గురువారం కోరారు. 34 హెడ్ నర్సులు, 43 కాంట్రాక్ట్ నర్సులు, ట్రామా కేర్లో 21 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. సిబ్బంది పనిభారం అధికమై రోగుల సేవలో నాణ్యత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.


