News August 31, 2024
విశాఖ: భారీ వర్షాలపై హోంమంత్రి సమీక్ష

భారీ వర్షాలపై విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అర్ధరాత్రి విశాఖ గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా చూడాలని కలెక్టర్‌లకు సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
Similar News
News February 15, 2025
విశాఖలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు శనివారం గంజాయి రవాణా నియంత్రణలో భాగంగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గంజాయి రవాణా అరికట్టడానికి ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, కొరియర్ ఆఫీసులు, పలు చోట్ల డాగ్ స్క్వాడ్ సహాయంతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. గంజాయి రవాణా చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
News February 15, 2025
పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాం: కలెక్టర్

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని ఆహ్లాదకర వాతావరణంలో పని చేద్దామని స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఫిబ్రవరి నెల 3వ శనివారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు, ఇతర సంస్థల పరిధిలో అధికారులు, సిబ్బంది చురుగ్గా పాల్గొంటున్నాట్లు ఆయన తెలిపారు.
News February 15, 2025
విశాఖలో జీబీఎస్ కలకలం.. ఐదు కేసులు నమోదు

విశాఖలో గులియన్ బారే సిండ్రోం (జీబీఎస్) కేసులు నమోదు కావడం కలకలం రేపింది. గడచిన నాలుగు రోజుల వ్యవధిలో ఐదుగురు ఈ సమస్యతో కేజీహెచ్‌లో చేరారు. ప్రస్తుతం జనరల్ మెడిసిన్ విభాగంలోని ఎక్యూట్ మెడికల్ కేర్ యూనిట్లో వీరు చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే పూర్తిగా కోలుకునేవరకు తమ పర్యవేక్షణలో సేవలు అందిస్తున్నట్లు కేజీహెచ్ వైద్యులు తెలిపారు.