News March 9, 2026

విశాఖ భీమిలి బీచ్ రోడ్‌లో విరాగో రిసార్ట్ సీజ్..!

image

భీమిలి బీచ్ రోడ్డులో విరాగో రిసార్ట్‌ను సోమవారం అధికారులు సీజ్ చేశారు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ కమిషనర్ ఉత్తర్వులతో అధికారులు రిసార్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేయడంతో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

Similar News

News April 13, 2026

విశాఖ: టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై మీ కామెంట్..!

image

GVMC పరిధిలో టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై ప్రతి సోమవారం PGRSలో అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయి. 2 నెలల క్రితం టౌన్ ప్లానింగ్ అధికారులు, నాయకులు వేధింపులు తాళలేక కంచరపాలెంలో ఒక వ్యక్తి ఉరి వేసుకునేందుకు ప్రయత్నించాడు. ఇటీవల టౌన్ ప్లానింగ్‌ శాఖపై ACB దాడులు కలకలం సృష్టించాయి. గత కలెక్టర్ కూడా ఈ శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ విశాఖ ప్రజలు టౌన్ ప్లానింగ్‌ సిబ్బందిపై మీ కామెంట్ తెలపండి.

News April 13, 2026

ఏప్రిల్ 17న సింహాచలంలో ఆర్జిత సేవలు రద్దు: ఈవో

image

సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఏప్రిల్ 17న గంధం అమావాస్యను పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు రానున్నారు. 16న సాయంత్రం నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి రాత్రి కొండదిగువన వరాహ పుష్కరిణి వద్ద, కొండపైన జాగరం చేసి అమావాస్య రోజు దర్శించుకోవడం ఆనవాయితిగా వస్తోంది. కావున ఏప్రిల్ 17న ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసినట్టు ఈవో వెంకట్రావు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

News April 12, 2026

విశాఖ: రేపు ప్రభుత్వ కార్యాలయాల్లో పీజీఆర్‌ఎస్

image

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గర్గ్ తెలిపారు. ఉదయం 11 నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.