News January 12, 2025
విశాఖ: భోగి మంట వేస్తున్నారా?

సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ రేపు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్ను వే2న్యూస్లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 73311 61607కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం
Similar News
News October 18, 2025
బీచ్లో లైట్లు ఏవి..? అధికారులపై మేయర్ ఆగ్రహం

విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు శనివారం రాత్రి ఆర్కే బీచ్ పరిసరాలను పరిశీలించారు. బీచ్లో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయనందుకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలల క్రితమే ఆదేశించినా చర్యలు తీసుకోలేదని మేయర్ విమర్శించారు. బీచ్లో హైమాస్ట్ లైట్లు వెలగక సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాగే పరిశుభ్రతపై శ్రద్ధ వహించి, బీచ్ అందాన్ని కాపాడాలని సూచించారు.
News October 18, 2025
విశాఖ-పార్వతీపురం మధ్య స్పెషల్ ట్రైన్

దీపావళి రద్దీ దృష్య్టా ఈనెల 27 వరకు విశాఖ-పార్వతీపురం మధ్య మెము స్పెషల్ ట్రైన్ నడవనుంది. విశాఖలో ఉ.10కు బయలుదేరి పార్వతీపురం మ.12.20కు చేరుకుంటుంది. తిరిగి పార్వతీపురంలో మ.12.45కు బయలుదేరి బొబ్బిలి 1.10కు చేరుకుని విశాఖ సా.4గంటలకు వెళ్లనుంది. సింహాచలం, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, గజపతినగరం, కోమటిపల్లి, డొంకినవలస, బొబ్బిలి, సీతానగరంలో ఆగనుంది. > Share it
News October 18, 2025
ఆటోలు గుద్దుకున్నా ఛలో పోలీస్ స్టేషన్ అంటారేమో: విష్ణుకుమార్ రాజు

వైసీపీ స్థితిని చూస్తే బాధ కలుగుతోందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. రెండు ఆటోలు గుద్దుకున్నా ఛలో పోలీస్ స్టేషన్ అనే స్థాయికి దిగిపోయిందని ఎద్దేవా చేశారు. వైజాగ్ ఐటీ, ఐటీ అనుబంధ రంగాలకు బెస్ట్ డెస్టినేషన్ అవుతుందన్నారు. అదానీకి భూములు ధారాదత్తం చేసిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. గూగుల్ డేటా సెంటర్ వల్ల ప్రత్యక్షంగా 2వేల ఉద్యోగాలు, పరోక్షంగా వేలాది మంది ఉపాధి పొందుతారని వెల్లడించారు.