News January 13, 2025

విశాఖ: భోగి మంట వేస్తున్నారా?

image

సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్‌ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ నేడు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్‌‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 73311 61607కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం

Similar News

News February 17, 2025

దువ్వాడలో కొట్లాటకు దిగిన ఇంజినీరింగ్ స్టూడెంట్స్ 

image

దువ్వాడలోని విజ్ఞాన్ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థులు కొట్లాటకు దిగారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. కాలేజీలో జరుగుతున్న ఈవెంట్‌లో డాన్స్ చేస్తున్న సమయంలో వివాదం తలెత్తింది. సెకండియర్ విద్యార్థి ప్రదీప్ కాలు పొరపాటున థర్డ్ ఇయర్ విద్యార్థి సూర్యాకు తగిలింది. దీంతో ఆగ్రహానికి గురైన సూర్యాతో పాటు అతని స్నేహితులు.. ప్రదీప్‌, అతని ఫ్రెండ్ ఈశ్వర్‌పై దాడి చేశారు. 

News February 17, 2025

రోడ్డు ప్రమాదంలో గాజువాక యువకుడి మృతి

image

గాజువాకకు చెందిన కర్రీ సాయికిరణ్(17) పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా బైక్‌ అదుపుతప్పి బండరాయిను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. G.మాడుగుల(M) గుదలం వీధి మలుపు వద్ద ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో పోలీసుల సహాయంతోనే పాడేరు తరలించారు. అక్కడి నుంచి కేజీహెచ్‌కు తీసుకొస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. సాయి కిరణ్ మృతితో చైతన్య నగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

News February 17, 2025

భీమునిపట్నం: రోడ్డుపై మట్టిని తొలగించిన కానిస్టేబుళ్లు

image

విధి నిర్వహణలో సామాజిక బాధ్యతతో వ్యవహరించిన పెట్రోలింగ్ పోలీసులు పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. ఆదివారం రాత్రి భీమిలి బీచ్ రోడ్డులో తిమ్మాపురం నుంచి రామానాయుడు స్టూడియో మధ్యలో లారీ నుంచి మట్టి జారి రోడ్డు మధ్యలో పడింది. దీనిని గమనించిన బీచ్ పెట్రోల్ కానిస్టేబుళ్లు సతీశ్, గణేశ్ వెంటనే స్పందించి మట్టిని తొలగించారు. అటుగా ప్రయాణిస్తున్న వాహనదారులకు జాగ్రత్తగా వెళ్లమని సూచించారు.

error: Content is protected !!