News January 12, 2025

విశాఖ: భోగి మంట వేస్తున్నారా?

image

సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్‌ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ రేపు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్‌‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 73311 61607కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం

Similar News

News February 16, 2025

మహిళను బెదిరించిన వ్యక్తి అరెస్ట్: సైబర్ క్రైమ్ పోలీసులు

image

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఇబ్బందులు పెడుతున్న వ్యక్తిని శనివారం రిమాండ్‌కు పంపించారు. నగరానికి చెందిన ఓ మహిళకు ఫేక్ ఇన్‌స్టా ద్వారా తన ఫేస్‌తో అశ్లీలంగా మార్ఫ్ చేసిన ఫొటోస్ వచ్చాయి. న్యూడ్ వీడియో కాల్ చేయాలని లేదంటే ఫొటోస్ ఫార్వార్డ్ చేస్తానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదుతో కంచరపాలెంకు చెందిన వ్యక్తిగా గుర్తించి అరెస్ట్ చేశారు.

News February 16, 2025

డ్రైనేజీల్లో వ్యర్ధాలు వేసే వారికి ఫైన్ వేయండి: కలెక్టర్

image

విశాఖ నగర ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో జీవీఎంసీ అధికారులు సమిష్టిగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. డ్రైనేజీల్లో వ్యర్ధాలు వేసే వారిని గమనించి అపరాద రుసుములను వసూలు చేయాలన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైతే ప్లానింగ్ కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News February 15, 2025

విశాఖలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు

image

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు శనివారం గంజాయి రవాణా నియంత్రణలో భాగంగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గంజాయి రవాణా అరికట్టడానికి ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, కొరియర్ ఆఫీసులు, పలు చోట్ల డాగ్ స్క్వాడ్ సహాయంతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. గంజాయి రవాణా చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

error: Content is protected !!