News May 10, 2024
విశాఖ: మందుకు డబ్బులు ఇవ్వలేదని హత్య.. ముగ్గురికి యావజ్జీవం

హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవ జైలు శిక్ష విధిస్తూ విశాఖ నగర మెట్రోపాలిటీ స్పెషల్ జడ్జ్ ఎం.వెంకటరమణ గురువారం తీర్పు ఇచ్చారు. 2013 అక్టోబర్ 1న దేవుడనే వ్యక్తిని నిందితులు పీ.మధు, సోమశేఖర్, అనిల్ మద్యం కోసం డబ్బులు అడిగారు. డబ్బులు లేవని చెప్పడంతో దేవుడిపై దాడి చేశారు. భార్య పార్వతి దేవుని KGHలో చేర్పించింది. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి చనిపోయాడు. ఈ మేరకు పోలీసులు ఛార్జిషీట్ వేశారు.
Similar News
News February 13, 2025
విశాఖ: కాలేజీ పైనుంచి దూకి విద్యార్థి సూసైడ్

విశాఖలో బుధవారం అర్ధరాత్రి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒడిశా రాష్ట్రం రాయపూర్‌కి చెందిన చంద్రవంశీ (17) బోరవాణి పాలెంలోని నారాయణ కాలేజీలో చదువుతున్నాడు. అర్ధరాత్రి కాలేజీ 5వ అంతస్థు నుంచి దూకి చంద్రవంశీ మృతి చెందాడు. మృతదేహాన్ని KGHకి తరలించారు. పీఎంపాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. CITU నాయకులు గురువారం ఉదయం ఘటనా స్థలిని పరిశీలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 13, 2025
షీలా నగర్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి

గాజువాక షీలా నగర్ జాతీయ రహదారిపై గురువారం జరిగిన ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. మృతుడు తుంగ్లాం గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్‌గా గుర్తించారు. స్కూటీపై వెళ్తున్న ప్రవీణ్ రోడ్డుపై విగత జీవిగా పడిఉన్నాడు. ఘటనా స్థలానికి గాజువాక ట్రాఫిక్ పోలీసులు చేరుకున్నారు. ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందా.. ఏదైనా వాహనం ఢీకొట్టడంతో మృతిచెందాడా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
News February 13, 2025
వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్‌గా కన్నబాబు

వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్‌గా మాజీ మంత్రి కురసాల కన్నబాబును నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం కమిటీ ప్రకటన జారీ చేసింది. వైసీపీ హయాంలో కన్నబాబు మంత్రిగా పనిచేసిన నేపథ్యంలో విశాఖ జిల్లా ఇన్‌ఛార్జిగా కూడా కొనసాగారు. వైసీపీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో కన్నబాబు నియామకం చేపట్టారు.