News March 7, 2025

విశాఖ: మత్స్యకారుల వలకు చిక్కిన అరుదైన చేపలు

image

రుషికొండ బీచ్ వద్ద గల సముద్రంలో మత్స్యకారుల వలలకు అరుదైన చేపలు చిక్కాయి. చేపల వేట కోసం మత్స్యకారులు గురువారం సముద్రంలోకి వెళ్లారు. సముద్రంలో మత్స్యకారుల వలలోకి రెండు రకాల అరుదైన చేపలు చిక్కాయి. వాటిని తిరిగి సముద్రంలోకి విడిచిపెట్టినట్లు వారు తెలిపారు. ఒక్కోసారి సముద్ర పాములు వలకు చిక్కుతుంటాయని వారు పేర్కొన్నారు.

Similar News

News March 27, 2025

ఏప్రిల్ 1 నుంచి మీటర్ రీడర్లు రాష్ట్ర వ్యాప్త సమ్మె

image

ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్త మీటర్ రీడర్లు సమ్మె నిర్వహించనున్నట్లు ఏపీ విద్యుత్ మీటర్ రీడర్లు రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బాల కాశి అన్నారు. గురువారం విశాఖ ఈపీడీసీఎల్ జోనల్ కార్యాలయంలో ఈపీడీసీఎల్ సీఎండీకి డిమాండ్ల పత్రం అందజేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు.

News March 27, 2025

విశాఖ మేయర్ పీఠంపై ‘యాదవుల’ పట్టు..!

image

జీవీఎంసీ మేయర్‌గా గొలగాని హరి వెంకట కుమారిని కొనసాగించాలని విశాఖ జిల్లా యాదవ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే, ఆ స్థానాన్ని యాదవులకే ఇవ్వాలన్నారు. జీవీఎంసీలో 22 మంది యాదవ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్లు ఉన్నారన్నారు. ఏ సామాజిక వర్గంలో ఇంత మంది కౌన్సలర్లు లేరని గుర్తుచేశారు. 

News March 27, 2025

పెదగంట్యాడలో ఫ్రీ కోచింగ్.. ఎస్సీలు మాత్రమే అర్హులు

image

ఏపీ ప్రభుత్వం స్థాపించిన నేక్ ఆధ్వర్యంలో ఫ్రంట్ ఆఫీస్ అసోసియేట్ గా ఉపాధి కొరకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు నేక్ అసిస్టెంట్ డైరెక్టర్ రవికుమార్ గురువారం తెలిపారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన 18-44 సంవత్సరాలలోపు ఎస్సీ కులాలకు చెందిన యువతకు మాత్రమే 3 నెలల శిక్షణ ఇస్తారన్నారు. శిక్షణ అనంతరం ప్రైవేట్ సెక్టార్‌లో ఉపాధి కల్పిస్తారన్నారు. పెద్దగంట్యాడలోని నేక్ సెంటర్లో శిక్షణ అందిస్తామని తెలిపారు.

error: Content is protected !!