News February 9, 2025

విశాఖ: మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియకు బ్రేక్

image

విశాఖ జిల్లాలో గీత కులాలకు కేటాయించిన 14 మద్యం షాపులు లాటరీ పద్ధతికి బ్రేక్ పడింది. సోమవారం లాటరీ పద్ధతిలో షాపులు కేటాయించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తర్వాత తేదీని ఖరారు చేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.

Similar News

News February 11, 2025

UPDATE: రీల్స్ పేరుతో పెళ్లి.. యువకుడిపై పోక్సో

image

ఓ బాలిక ఇన్‌స్టా‌గ్రామ్‌లో చేసిన రీల్‌కు లైక్ కొట్టి ట్రాప్ చేసిన యువకుడిని విశాఖ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాటిచెట్లపాలెంకి చెందిన భార్గవ్ ఓ బాలిక రీల్‌కు లైక్ కొట్టి ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఈ క్రమంలో ఆమెకు దగ్గరై పెళ్లి చేసుకోగా విషయం బాలిక తల్లిదండ్రులకు తెలిసింది. వారి ఫిర్యాదు మేరకు భార్గవ్‌పై పోక్సో కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి సోమవారం రిమాండ్ విధించారు.

News February 11, 2025

విశాఖ: రోడ్డుప్రమాదంలో యువతి మృతి

image

విశాఖలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మృతిచెందింది. శ్రీకాకుళం(D) ఇచ్ఛాపురానికి చెందిన ఉషారాణి(22) స్నేహితుడు సిద్దూతో కలిసి ఓ ఫార్మా కంపెనీలో ఇంటెర్న్‌ చేస్తోంది. ఉషారాణికి కొరియర్ రాగా సిద్దూతో కలిసి బైక్‌పై ఆటోనగర్‌ వెళ్లింది. తిరిగి వస్తుండగా వెనుక నుంచి లారీ ఢీట్టడంతో ఉషారాణి కింద పడింది. ఆమె పైనుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు గాజువాక ట్రాఫిక్ CI కోటేశ్వరరావు తెలిపారు.

News February 11, 2025

విశాఖ: ఆన్‌లైన్ లోన్‌యాప్స్ ముఠా అరెస్ట్  

image

ఆన్ లైన్ లోన్ యాప్స్‌తో మోసాలకు పాల్పడుతున్న ముఠాను విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు సోమవారం అరెస్ట్ చేశారు. విశాఖలో ఓ సూసైడ్ కేసు విచారణలో భాగంగా లోన్ యాప్‌లో అప్పు తీసుకుని సమయానికి కట్టకపోవడంతో ఫొటోలు మార్ఫింగ్ చేసి వారు వేధించడం వల్ల చనిపోయినట్లు గుర్తించారు. ఈ విషయంపై విశాఖ పోలీసులు నిందితుడుని కర్నూలులో అరెస్ట్ చేశారు. ఈ కేసులో కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు.

error: Content is protected !!