News February 9, 2025
విశాఖ: మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియకు బ్రేక్

విశాఖ జిల్లాలో గీత కులాలకు కేటాయించిన 14 మద్యం షాపులు లాటరీ పద్ధతికి బ్రేక్ పడింది. సోమవారం లాటరీ పద్ధతిలో షాపులు కేటాయించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తర్వాత తేదీని ఖరారు చేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.
Similar News
News April 17, 2026
భీమిలి-విశాఖ బీచ్ రోడ్డులో కారు బీభత్సం

భీమిలి-విశాఖ బీచ్ రోడ్డులోని మంగవారిపేట జంక్షన్ వద్ద గురువారం ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. నగర పర్యాటనకు వచ్చిన హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులు ఈ ఘటనలో గాయపడ్డారు. సీసీ కెమెరా స్తంభాన్ని కూడా ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జైంది. ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా ఉండగా నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. బీచ్ పెట్రోలింగ్ పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు.
News April 17, 2026
విశాఖలో మురుగునీటి శుద్ధికి ₹500 కోట్లు

విశాఖ గ్రేటర్ పరిధిలో మురుగునీటిని శుద్ధి చేయడానికి, మురుగునీటి శుద్ధి ప్లాంట్ల అనుసంధానానికి ₹500 కోట్లు వ్యయం చేయనున్నట్టు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు 25% నిధులు కేంద్ర ప్రభుత్వం, మిగిలిన 75% నిధులు రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక సంస్థల ద్వారా సమకూర్చనున్నట్టు పేర్కొన్నారు. ఈ పనులు పూర్తయితే నగరంలో పారిశుద్ధ్య పరిస్థితులు గణనీయంగా మెరుగుపడనున్నాయి.